వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవభారత ప్రతినిధిగా..: కేటీఆర్‌కు స్టాన్‌ఫోర్డ్ రెండోసారి ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు అమెరికాలోని స్టాన్‌పోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం వచ్చింది. ఈ ఏడాది మే 18, 19 తేదీల్లో జరిగే వర్సిటీ వార్షిక సదస్సులో మాట్లాడాలని లేఖ రాసింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు అమెరికాలోని స్టాన్‌పోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం వచ్చింది. ఈ ఏడాది మే 18, 19 తేదీల్లో జరిగే వర్సిటీ వార్షిక సదస్సులో మాట్లాడాలని లేఖ రాసింది.

ఉపాధి, ఉద్యోగాల కల్పన, పరిశ్రమలు అంశంపై ఈ సదస్సులో కీలక ఉపన్యాసం ఇవ్వాలని కోరింది. ఈ సమావేశానికి స్టాన్‌ఫోర్డ్‌ విద్యార్థులు, అధ్యాపకులతో పాటు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని ఆ లేఖలో పేర్కొంది.

<strong>పార్టీ భేటీలో పొగడ్త.. తర్వాత కేసీఆర్‌కు ఫోన్ చేసి చంద్రబాబు శుభాకాంక్షలు</strong>పార్టీ భేటీలో పొగడ్త.. తర్వాత కేసీఆర్‌కు ఫోన్ చేసి చంద్రబాబు శుభాకాంక్షలు

రెండున్నరేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి, సాంకేతికత, నైపుణ్య శిక్షణ, పరిశ్రమలకు ప్రోత్సాహం గురించి మాట్లాడాలని ఈ సందర్భంగా సూచించింది.

Stanford invites KTR to speak about Telangana development

కేటీఆర్‌ను నవభారతానికి ప్రతినిధిగా ఆహ్వానిస్తున్నట్లు, సదస్సులో పాల్గొనే వారికి తెలంగాణ ఒక అధ్యయనం(కేస్ స్టడీ)గా ఉపయోగపడుతుందని భావిస్తున్నామని స్టాన్‌ఫోర్డ్‌ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ అంజని కొచ్చార్‌ పేర్కొన్నారు.

కాగా, కేటీఆర్‌కు వరుసగా రెండో ఏడాది స్టాన్‌ఫోర్డ్ నుంచి ఆహ్వానం వచ్చింది. వరుసగా రెండో ఏడాది తనకు స్టాన్‌ఫోర్డ్‌ నుంచి ఆహ్వానం లభించడంపై మంత్రి కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల హార్వార్డ్ యూనివర్సిటీలో ప్రసంగించారు.

English summary
Minister KT Rama Rao was asked to speak on entrepreneurship and utilisation of technologies in the background of Telangana’s development in the last two and half years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X