మీకు రేషన్ కార్డు ఉందా..? అయితే GOOD NEWS

రేషన్ కార్డు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తామని రాష్ట్రం ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. కానీ పలు కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 4. 59 లక్షల టన్నుల సన్న బియ్యం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఉగాది నుంచి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఒక్కొక్కరికి నెలకు 6 కేజీల బియ్యం అందిస్తారు.

ఇప్పటికే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సన్న బియ్యం పెడుతున్నారు. రాష్ట్రంలోని రేషన్ కార్డు దారులు, విద్యార్థులు కలిపి ప్రతినెలా 2.30 లక్షల సన్న బియ్యం అవసరం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ వద్ద 4.59 లక్షల టన్నుల సన్న బియ్యం ఉంది. ఈ నిల్వలు రెండు నెలలకు సరిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నిల్వలతోపాటు అటు సన్న వడ్ల మిల్లింగ్ కూడా జరుగుతోంది. మరోవైపు మరో రెండు నెలల్లో యాసంగి ధాన్యం సేకరణ ప్రారంభం అవుతుంది. ఈలోపు వానాకాలం సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ చేసి పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

State Government to Distribute Parboiled Rice to Ration Card Holders

ఇక రాష్ట్రంలో మొత్తం 89.98 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 2.81 కోట్ల మంది లబ్ధి దారులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తారు. అయితే పంపిణీ చేసిన దొడ్డు బియ్యం ప్రజలు వినియోగించుకోకుండా రీసైక్లింగ్ కు పంపిస్తున్నారు. దీంతో ప్రజలకు సన్న బియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+