మహిళల సెల్‌ఫోన్లే టార్గెట్: ఆ తర్వాత అసభ్యంగా సంభాషణ
హైదరాబాద్: మహిళల ఫోన్లను దొంగిలించడమే పనిగా పెట్టుకుని, వారిని అసభ్య పదజాలంతో అవమానిస్తున్న వ్యక్తిని పోలీసులు అరేస్టు చేశారు. మహిళల నుంచి దొంగిలించిన సెల్ ఫోన్లలోని మహిళల నెంబర్లకు నిత్యం ఫోన్ చేసి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ హింసించడం ప్రారంభించాడు.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన హైదరాబాదులోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ భిక్షపతిరావు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

నెల్లూరు జిల్లా ఉదయ్‌గిరి మండలం ఆర్లపాడి గ్రామానికి చెందిన ముత్తుకుందు బ్రహ్మయ్య(27) బతుకుదెరువు కోసం నగరానికొచ్చి ఫిరోజ్‌గూడలో నివాసముంటూ ఓ చిట్‌ఫండ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఖాళీ సమయాల్లో మహిళలు ఉండే ఇళ్లను టార్గెట్ చేసి వారి సెల్‌ఫోన్లను దొంగిలిస్తుంటాడు. ఆ ఫోన్లలో ఉన్న మహిళల ఫోన్ నెంబర్లను సేకరించి, నిత్యం వారి ఫోన్ చేసి వేధించడం వృత్తిగా పెట్టుకున్నాడు
అతడి వేధింపులకు విసుగు చెందిన పలువురు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా అతడిని సెల్‌ఫోన్ జీపీఎస్ ద్వారా కనిపెట్టి అదుపులోకి తీసుకుకున్నారు. బ్రహ్మయ్యపై దొంగతనం, వేధింపుల కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications