సరదా కోసమే: హార్లీ డేవిడ్‌సన్ బైక్ దొంగ వెల్లడి
హైదరాబాద్: ట్రయల్ రన్ పేరుతో హార్లీ డేవిడ్‌సన్ బైకుతో ఉడాయించిన దొంగ సరదా కోసమే దాన్ని దొంగిలించాడట. ఖరీదైన బైక్ నడపాలనే కోరికను తాను ఇలా తీర్చుకున్నట్లు అతను చెప్పాడు. ఆరు లక్షల రూపాయల ఖరీదైన హార్లీ డేవిడ్‌సన్ బైకును ఎత్తుకెళ్లిన వ్యక్తిని పోలీసులు ముంబైలో పట్టుకున్న విషయం తెలిసిందే.

సికింద్రాబాదులోని సైనిక్‌పురికి చెందిన ప్రకాశ రావు మాజీ సైనికాధికారి. ఆయన ఆఖరి కుమారుడు తుర్లపాటి కిరణ్ పెట్రో కెమికల్స్ విభాగంలో బిటెక్ చదివి ఓఎన్‌జిసిలో రూ.15 లక్షల వేతనం వచ్చే ఉద్యోగం చేస్తున్నాడు. ఖరీదైన బైక్‌ను నడపాలనే కోరిక అతన్ని వెంటాడుతూ వచ్చింది.
హార్లీ డేవిడ్‌సన్‌లో ఆరు లక్షల విలువైన బైక్‌ను ట్రయల్ రన్ పేర తీసుకుని ఇటీవల పరారయ్యాడు. బైక్ షోరూంవారు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. బైక్ పోయిన సమయంలో నమోదైన సెల్‌ఫోన్ల కాల్ డేటాను పోలీసులు సంపాదించారు.

వాటిని పరిశీలించగా కిరణ్ ముంబైలోని ప్రకాశ్ అనే తన స్నేహితుడితో మాట్లాడినట్లు తేలింది. దీంతో పోలీసులు ముంబై మార్గంలో కొత్త బండి వెళ్లిన విషయంపై ఆరా తీశారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు ముంబై చేరుకుని కిరణ్‌ను పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications