వామ్మో.. చిన్నారి కంటి నుంచి రాళ్లు, బియ్యం గింజలట..? ఆస్పత్రిలో చికిత్స

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అంటే శరీరంలో కళ్లు కీలకం అనే నానుడి ఉంది. నిజానికి కళ్లు చాలా సున్నితమైనవి కూడా. దాని నుంచి నీళ్లు వస్తుంటాయి. బాధలో ఉంటే కన్నీళ్లు.. సంతోషంగా ఉంటే ఆనంద భాష్పాలు రాలతాయి. కానీ ఓ చిన్నారి కంటి నుంచి రాళ్లు, బియ్యం గింజలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఆమె పేరంట్స్ తెలియజేశారు.

గద్వాల జిల్లా మానవపాడుకు చెందిన రంగన్న, లక్ష్మీ దంపతుల కూతురు లక్ష్మీ దీపాలి.. ఆమె వయస్సు 11 ఏళ్లు. గత రెండు రోజుల నుంచి కంటి సమస్యతో బాధపడుతుంది. చిన్నారి కంటి నుంచి రాళ్లు, బియ్యం గింజలు వస్తున్నాయి. ఆ సమయంలో నొప్పిగా ఉంటుందట. దీంతో కుటుంబ సభ్యులు కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

stones coming from the eyes of a girl

పరీక్షలు నిర్వహించిన వైద్యులు బియ్యం, రాళ్లు వంటివేమీ లేవని పేర్కొన్నారు. డాక్టర్ పర్యవేక్షణలో ఉన్ సమయంలో మాత్రం చిన్నారి కళ్ల వెంట బియ్యం, రాళ్లు రాలేదు. అయినప్పటికీ ఆమెను అబ్జర్వేషన్‌లో ఉంచుతామని పేర్కొన్నారు. ఒకవేళ అలాంటివీ వస్తే పరీక్షిస్తామని అంటున్నారు. అవసరమైతే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఎల్వీ ప్రసాద్ వద్దకు రిఫర్ చేస్తామని చెబుతున్నారు.

గత రెండు రోజులుగా లక్ష్మీ దీపాలి ఈ సమస్యతో బాధపడుతుంది. రోజూ పాప కంటి నుంచి 10 నుంచి 13 చిన్న చిన్న రాళ్లు, బియ్యం గింజలు బయటకు వస్తాయట. ఆ సమయంలో నొప్పితో చిన్నారి ఇబ్బంది పడుతుందట. ఈ విషయాన్ని ఆ పాప పేరంట్స్ చెబుతున్నారు. చూడాలీ మరీ వైద్యుల పర్యవేక్షణలో కూడా వస్తే.. తగిన చికిత్స చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+