• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కయ్యం పెట్టిన బియ్యం.!బలపడుతున్న బీజేపి.!హుజురాబాద్ ఓటమి.!కేసీఆర్ కు కుదుపేనా.?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : సంక్షోభం తలెత్తినప్పుడు మాత్రమే రంగప్రవేశం చేసే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఇతర సమయాల్లో ఎక్కడ, ఏం చేస్తారో మూడోకంటికి కూడా తెలియదు. ప్రగతి భవన్ లేదంటే ఫాంహౌస్ లో ఆయన ఒంటరిగా కూర్చొని విపక్షాలను చిత్తుచేసే వ్యూహాలకు పదునుపెడుతుంటారు. మెరుపులాంటి ఆలోచన పుట్టిందే ఆలస్యం అనుయాయులను రంగంలోకి దింపుతారు. ట్రబుల్ షూటరైనా, త్రిబుల్ షూటరైనా పైకి కనిపించే వ్యక్తులే తప్ప దాని వెనుక శక్తి మాత్రం చంద్రశేఖర్ రావే. కొన్ని సందర్భాల్లో హరీష్ ను,మరి కొన్ని సందర్భాల్లో కేటీఆర్ ను రంగంలోకి దించినా దాని ఆలోచన, వ్యూహం, ఎత్తుగడ అంతా చంద్రశేఖర్ రావుదే. ఇంతటి యుక్తితో అడుగులేస్తున్న చంద్రశేఖర్ రావును రాజకీయంగా కుదుపులు ఇబ్బందిపెడుతున్నాయా.? ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు ఏంచెప్తున్నాయి.?

తెలంగాణలో అనూహ్య రాజకీయాలు.. రంగంలోకి దిగిన కేసీఆర్

తెలంగాణలో అనూహ్య రాజకీయాలు.. రంగంలోకి దిగిన కేసీఆర్

అనూహ్య రాజకీయ పరిణామాలు, కీలక మలుపుల తర్వాత ఈ వ్యూహకర్త రంగ ప్రవేశం చేస్తున్నాడు. నేరుగా బరిలో దిగుతున్నాడు. రెస్ట్ మోడ్ నుంచి వార్ మోడ్ లోకి అడుగు పెడుతున్నట్టు తెలు్తోంది. ట్రబుల్ షూటర్స్, త్రిబుల్ షూటర్స్ ను కాదని ఆయనే నేరుగా కదన రంగంలోకి అడుగిడుతున్నారు. ఈ మధ్య కాలంలో చంద్రశేఖర్ రావు నేరుగా జన సంద్రంలోకి వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీ శ్రేణులతో మమేకమవుతూ పార్టీలో నెలకొన్న నిరుత్సాహాన్ని తొలగించే ప్రయత్నం చేసేందుకు అస్త్రాలు సిద్దం చేస్తున్నారు. ప్రధానంగా హుజూరాబాద్ ఉప్పఎన్నిక ద్వారా ఏర్పిడిన డ్యామేజ్ ను నివారించి గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

కుదిపేస్తున్న రాజకీయ పరిణామాలు.. కేసీఆర్ కు సంకటంగా మారిన రాజకీయాలు

కుదిపేస్తున్న రాజకీయ పరిణామాలు.. కేసీఆర్ కు సంకటంగా మారిన రాజకీయాలు

ఒక్క హుజూరాబాద్ కాకుండా రాష్ట్రంలో ప్రతి అంశంలోనూ నేరుగా చంద్రశేఖర్ రావు జోక్యం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. చంద్రశేఖర్ రావులో ఈ తాజా మార్పు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రవేఖర్ రావు ఎందుకు గేరు మార్చారు.?వ్యూహకర్త నుంచి ఎగ్జిక్యూటర్ గా ఎందుకు మారుతున్నారు అనే అంశం ఇప్పుడు వైరల్ గా మారుతోంది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు వేగం పుంజుకుంటున్నాయి. గత ఏడాది కాలంగా బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తూ అందుకు తగ్గట్టుగానే అదికార పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరోపక్క రేవంత్ రెడ్డి ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. రాజకీయంగా ఏర్పుడుతున్న ప్రతికూల పరిస్థుతులను అధిగమించేందుకు చంద్రవేకర్ రావు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ఓపక్క కాంగ్రెస్, మరోపక్క బీజేపి.. కేసీఆర్ పై ఎదురు దాడి చేస్తున్న రాజకీయం

ఓపక్క కాంగ్రెస్, మరోపక్క బీజేపి.. కేసీఆర్ పై ఎదురు దాడి చేస్తున్న రాజకీయం

అంతే కాకుండా వరి పంట కొనుగోలు అంశంపై కేంద్రంతో తలెత్తిన వివాదం, రాష్ట్ర బీజేపితో ముదురుతున్న వైరం చంద్రశేఖర్ రావుకు ఇబ్బందికరంగా మారింది. హుజురాబాద్ లో ప్రాణాలుపెట్టి, జీవన్మరణ సమస్యగా పోరాటం చేసినా ప్రతికూల ఫలితం రావడంతో చంద్రశేఖర్ రావు ఇబ్బందిపడ్డట్టు తెలుస్తోంది. ఏమీ లేదనుకున్న బీజేపి తెలంగాణలో విస్తరించడం చంద్రశేఖర్ రావును కలవరానికి గురి చేస్తున్న అంశంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర బీజేపి నేతలకు అసలు ప్రధాన్యత ఇవ్వని చంద్రశేఖర్ రావు కేవలం బీజేపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ గురించే రెండు విలేఖరుల సమావేశాలు నిర్వహించడం వల్ల ఎంత ఆత్మరక్షణలో పడిపోయారోననే చర్చ కూడా చోటుచేసుకుంది.

Recommended Video

Telangana: Temperature Dips, Rapidly Falling in TS
గులాబీ ఇలాకాలో అనిశ్చితి.. కేసీఆర్ ఎలా అదిగమిస్తారు అనే అంశంపై ఆసక్తి..

గులాబీ ఇలాకాలో అనిశ్చితి.. కేసీఆర్ ఎలా అదిగమిస్తారు అనే అంశంపై ఆసక్తి..

ఇక చంద్రశేఖర్ రావు దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మంగా ప్రవేశ పెడితే అందుకు తగ్గట్టే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహించి చంద్రశేఖర్ రావులో ఇంకా ఒత్తిడి పెంచారు. ఇలా కాంగ్రెస్ గేరు మీద గేరు మారుస్తుండటంతో చంద్రశేఖర్ రావు అలెర్ట్ అయినట్టు కనిపిస్తోంది. మరో పక్క రాష్ట్రం బీజేపితో పాటు కేంద్ర బీజేపి ప్రభుత్వం చంద్రశేఖర్ రావును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలను కట్టడి చేసేందుకు చంద్రశేఖర్ రావు నేరుగా రంగప్రవేశం చేయడంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఎమ్మెల్సీ ఎన్నికల వాతావరణం వాడివేడిగా కొనసాగుతున్న తెలంగాణ రాజకీయంపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో, చంద్రశేఖర్ రావు ఆ అంశాన్ని ఎంత రసకందాయంగా మార్చుతారో చూడాలి.

English summary
Even if Harish and KTR are brought into the field, its idea, strategy and tactic will all come from Chandrasekhar. Is Chandrasekhar Rao, who is stepping in with this maneuver, being bothered by political upheavals? What are the recent developments?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X