సమ్మె ఎఫెక్ట్-జూడాలు,సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల వేతన పెంపు-ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మెకు ప్రభుత్వం ముగింపు పలికింది. జూడాలతో చర్చలు జరిపిన ప్రభుత్వం 15 శాతం మేర వేతన పెంపుకు అంగీకరించింది. పెరిగిన స్టైఫండ్‌ ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తిస్తుంది. సీనియర్ రెసిడెంట్ల వేతనాన్ని ప్రభుత్వం రూ.70 వేల నుంచి రూ.80,500కి పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ నిర్ణయంతో జూడాల సమ్మెకు ఫుల్ స్టాప్ పడినట్లయింది.

వైద్యులు, హెల్త్‌ వర్కర్ల కుటుంబ సభ్యులు కోవిడ్‌ బారిన పడితే.. వారికి నిమ్స్‌ ఆస్పత్రిలో ప్రత్యేక చికిత్స అందించాలన్న డిమాండుపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.ఇందుకోసం నిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక డెస్కును ఏర్పాటు చేయాలని వైద్య శాఖ నిర్ణయం తీసుకుంది. జూడాలు,సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ప్రభుత్వం ముందు పెట్టిన ఇతర డిమాండ్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

 strike affect telangana govt hikes junior doctos and senior doctors salaries

వైద్యుల ఇతర డిమాండ్లలో కోవిడ్ విధులు నిర్వహిస్తున్న జూనియర్ వైద్యులకు ప్రాణాపాయం సంభవిస్తే వారి కుటుంబాలకు రూ.50 లక్షలు,నర్సింగ్ సిబ్బందికి రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలన్న డిమాండుతో పాటు ప్రభుత్వం గతంలో ప్రకటించినట్లుగా 10 శాతం కరోనా అలవెన్సులను అమలుచేయాలన్న డిమాండ్లు ఉన్నాయి.

రాష్ట్రంలో రెండు రోజులుగా జూడాలు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. గురువారం(మే 27) నుంచి అత్యవసర సేవలు కూడా బంద్ చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. గతంలో ఇచ్చిన హామీ మేరకు 15 శాతం వేతన పెంపుకు ఆమోదం తెలిపింది.

Recommended Video

    Megastar Chiranjeevi ఆక్సిజ‌న్ బ్యాంకులు స్టార్ట్, Ram Charan పర్యవేక్షణ || Oneindia Telugu

    అంతకుముందు,మంత్రి కేటీఆర్ సమ్మెకు ఇది సరైన సమయం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం జూడాల సమస్యలను పరిశీలిస్తోందని... జూనియ‌ర్ డాక్టర్లు త‌క్షణ‌మే స‌మ్మె విర‌మించి విధుల్లో చేరాల‌ని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+