మరో పెళ్లి చేసుకో: ప్రేమించి పెళ్లాడిన భార్యతో జైలుపాలైన నిందితుడు, ఏం జరిగింది?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అతడు ఓ యువతిని ప్రేమించి పెళ్లాడాడు. కానీ, అతడు ఓ కేసులో నిందితుడిగా తేలడంతో ఆమెతో కొంత కాలం కూడా కాపురం చేయకుండానే జైలు పాలయ్యాడు. ఈ క్రమంలో అతడే తను కట్టుకున్న భార్యను మరో పెళ్లి చేసుకోమని కోరాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటకు చెందిన కలీం వృత్తిరీత్యా వెల్డర్. 23ఏళ్ల వయసులో కలీం ఓ యువతిని ప్రేమించి పెళ్లాడాడు. పెళ్లి చేసుకున్న కలీం సజావుగా కాపురం చేయకుండానే బాంబుపేలుడు కేసులో నిందితుడిగా తేలాడు. దీంతో అతడు 2005వ సంవత్సరంలో జైలు పాలయ్యాడు.

జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న కలీం తాను అమితంగా ప్రేమించే భార్యను మరో పెళ్లి చేసుకోమని కోరాడని సమాచారం. కలీం 12 ఏళ్లుగా జైలులోనే మగ్గుతుండటంతో అతని సూచనతో భార్య ఐదేళ్ల క్రితం మరో పెళ్లి చేసుకుందని కలీం బంధువు తెలిపారు.

Stuck in prison, he asked wife to marry someone else
Sania Mirza

కాగా, కలీం బాంగ్లాదేశ్ వెళ్లి హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ సంస్థ సభ్యులతో కలిసి బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడని పోలీసులు కేసు పెట్టారు. బాంబు పేలుడు కేసు విచారణ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో జైలు పాలైన భర్త.. భార్యను మరో పెళ్లి చేసుకోమని కోరడం...ఆమె అతని సూచనతో మరో పెళ్లి చేసుకోవడం చర్చనీయంగా మారింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kaleem, who had a love marriage with Aiyesha (name changed) just two months prior to his arrest in 2005 in the Task Force bomb blast case, is a distraught man. His family life came to naught, being in jail for the past 12 years. Realising that he was stuck in jail when he became an undertrial, Kaleem told his wife of five years to remarry.
Please Wait while comments are loading...