హైదరాబాద్‌లో సుబ్రతా రాయ్: ఇన్వెస్టర్లు, స్టేక్ హోల్డర్లతో భేటీ
హైదరాబాద్: సహారా పరివార్ అధినేత సుబ్రతా రాయ్ శుక్రవారం హైదరాబాద్‌లోని సంస్థకు చెందిన ఇన్వెస్టర్లు, వినియోగదారులు, ఇతర స్టేక్ హోల్డర్లతో సమావేశం కానున్నారు. అక్రమంగా డిపాజిట్లు సమీకరించిన కేసులో అరెస్టయిన రాయ్.. కొద్ది రోజుల క్రితం పెరోల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
సుబ్రతా రాయ్ తల్లి చబ్బీ రాయ్ మరణించటంతో ఉత్తర క్రియలతో పాటు ఇతర కర్మల్లో పాల్గొనేందుకు ఆయనకు సుప్రీం కోర్టు పెరోల్ మంజూరు చేసింది. జూలై 11 వరకు ఈయన పెరోల్‌పై ఉండనున్నారు. హైదరాబాద్‌కు సుబ్రతా వస్తున్న విషయాన్ని సహారా వర్గాలు ధృవీకరించాయి.

దాదాపు మూడు నాలుగు వేల మంది సహారా పరివార్‌కు చెందిన ఉద్యోగులు, కస్టమర్లు, ఇతర వాటాదారులను ఆయనను కలుసుకునే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ప్రైవేట్‌గా నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది.
కోర్టు కేసుల కారణంగా సుబ్రతా రాయ్ మీడియాను కలుసుకోవడానికి సుముఖంగా లేరని సహారా పరివార్ వర్గాలు తెలిపాయి. కాగా, హైదరాబాదులో సహారా గ్రూప్ నకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులతో పాటు డిపాజిటర్లు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు.












Click it and Unblock the Notifications