చంద్రబాబును చూసైనా నేర్చుకో: కెసిఆర్‌కు కాంగ్రెస్ నేత షాక్
హైదరాబాద్/నిజామాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును చూసి అయినా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేర్చుకోవాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి శనివారం అన్నారు.
గోదావరి జలాల ఆధారంగా పట్టిసీమ వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు నమూనా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రూపుదిద్దుకుందన్నారు. పట్టిసీమ ప్రయోజనకర ప్రాజెక్టు కావడం వల్ల ఏపీ సీఎం చంద్రబాబు పనులు చేయిస్తున్నారన్నారు.
పట్టిసీమను పూర్తి చేస్తే ఐదు జిల్లాలకు ప్రయోజనమని భావించి, చంద్రబాబు పనుల పైనే దృష్టి సారించారన్నారు. పట్టిసీమ పైన చంద్రబాబు విధానాన్ని తెలంగాణ సిఎం కెసిఆర్ అనుసరించాలని ఆయన సూచించారు.

కెసిఆర్ - బాబు
ఏపీ సీఎం చంద్రబాబును చూసి అయినా తెలంగాణ సీఎం కెసిఆర్ నేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి శనివారం అన్నారు.

తెలుగుదేశం
సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లు మారుస్తూ సిఎం కెసిఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన,ి దీనికి నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని తెలంగాణ టిడిపి శాసన సభ్యులు నిర్ణయించారు.

తెలుగుదేశం
ఆ పార్టీ శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు అధ్యక్షతన శనివారం ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును తొలి డిజైన్ ప్రకారం పూర్తి చేయాలని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రాణహిత ప్రాజెక్టు స్థలం నుంచి చేవెళ్ల వరకూ పాదయాత్ర చేయాలని నిర్ణయించారు.

తెలుగుదేశం
కృష్ణా నది పైన కర్నాటక నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల పైన ప్రజలను చైతన్యపరుస్తూ మహబూబ్ నగరి జిల్లాలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, పార్టీ నేతలు రావు, పి రాములు, కొత్తకొట పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. నిజామాబాదులో పెండింగు ప్రాజెక్టుల పూర్తి కోసం మండవ వెంకటేశ్వర రావు, అరికెల నర్సారెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేయనున్నారు.












Click it and Unblock the Notifications