కేటీఆర్‌కు 36 గంటలుగా తీవ్రమైన జ్వరం
తాను గత 36 గంటలుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జ్వరంతోపాటు దగ్గు, జలుబు కూడా ఉందన్నారు. వైద్యుల సూచన మేరకు యాంటీవైరల్, యాంటీ బయాటిక్స్ మందులు వాడుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. త్వరలోనే కోలుకుంటానంటూ ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు.
కాగా, హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో తెలంగాణ భవన్‌కు బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేటీఆర్ ను కలిసి తమ గోడును వెళ్లబోసుకుందామనుకున్నారు. అయితే, హైడ్రా బాధితుల వద్దకు కేటీఆర్ జ్వరం కారణంగా రాలేకపోయారు. ఈ క్రమంలోనే తాను 36 గంటలుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు తెలియజేశారు. తెలంగాణ భవన్ కు వస్తున్న బాధితులకు పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, పార్టీ న్యాయ విభాగం అండగా ఉంటుందని తెలిపారు.

మరోవైపు, గనుల శాఖలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలంటూ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. నకిలీ పత్రాలు, రసీదులు సృష్టించి ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి రూ. 150 కోట్ల విలువైన ఇసుకను దోచుకున్న ఇంటిదొంగపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గనుల శాఖలో అవినీతి ఘనులని పేర్కొన్నారు.
Down with fever, cough and heavy cold since 36 hours. Taking Anti viral, antibiotics, anti histamine as per doctor instructions
— KTR (@KTRBRS) September 28, 2024
Hopefully will be better soon
Meanwhile, our @BRSparty MLAs and senior leaders along with legal team will support the demolition victims who are…
నకిలీ పత్రాలు, రసీదులతో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి రూ. 150 కోట్లు విలువ చేసే 1.5 లక్షల టన్నుల ఇసుక దోచేశారని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అవసరాల కోసమంటూ తప్పుడు కాగితాలు సృష్టించి ఇసుకను దారి మళ్లించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలోనే జరిగిన ఈ స్కాం, ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఉండదన్నారు. వెంటనే దర్యాప్తు జరిపి ఇసుక దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications