పచ్చపార్టీ అంటూ సుమన్, మేం ఏం చేయాలో అది చేస్తాం: కెటిఆర్ హెచ్చరిక
హైదరాబాద్: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పైన ఎంపీ బాల్క సుమన్ సోమవారం మండిపడ్డారు. పచ్చపార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని టిడిపిని ఉద్దేశించి ధ్వజమెత్తారు. రైతు యూనిట్‌గా బీమా ఉండాలని తాము కేంద్రాన్ని కోరామని బాల్క సుమన్ చెప్పారు.
వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రకు వెళ్లినట్లు కాంగ్రెస్ నేతల తీరు ఉందన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పైన కాంగ్రెస్ నేతలది సవతి తల్లి ప్రేమ అన్నారు. ఉద్యమం సమయంలో విద్యార్థులను కొట్టించిన చరిత్ర కాంగ్రెస్ నేతలది అన్నారు.

కేసీఆర్ మనసున్న ముఖ్యమంత్రి: కేటీఆర్
రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రులు కెటి రామారావు, మహేందర్ రెడ్డి పర్యటించారు. మేడ్చల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ మనసున్న ముఖ్యమంత్రి అన్నారు.
రాష్ట్రంలో కనీస వసతుల కల్పనకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్నారు. సాంఘీక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం పెడుతున్నారన్నారు. అభివృద్ధిని సంక్షేమాన్ని కలగలిపి ముందుకు పోతున్నామన్నారు.
ఇంటింటికి మంచినీటిని ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. ఇంటింటికి ఏడాదిలో మంచినీటిని ఇస్తామన్నారు. ప్రజా సంక్షేమాన్ని పణంగా పెట్టి చిల్లర రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఎన్నికలు ఇంకా ఐదేళ్లు ఉంది ధర్నాలు చేయాలంటూ అప్పుడు చేయాలన్నారు. మీరు ఇలాగే ధర్నాలు చేస్తే మేం చేసేది మేం చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications