అన్నీ మాకే!: సుప్రీం కోర్టులో తెలంగాణకు షాక్, ఏపీకి ఊరట

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో తెలంగాణకు శుక్రవారం నాడు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ ఉన్నత విద్యామండలికి ఊరట లభించింది. ఏపీ ఉన్నత విద్యా మండలి ఆస్తులు తమకే చెందుతాయన్న తెలంగాణ రాష్ట్ర వాదనను సుప్రీం కోర్టు తిరస్కరించింది.

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి అప్పీళ్లను సుప్రీం కోర్టు అంగీకరించింది. విభజన తర్వాత ఆస్తులు, అప్పులు ఇరు రాష్ట్రాలకు పంచాలని సూచించింది. పంపకాలు జరగనట్లయితే సెక్షన్ 45 నిరుపయోగం అవుతుందని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

Supeme Court shock to Telangana in APSCHE assets

సెక్షన్ 75 ప్రకారం ఆస్తులు తమకే చెందుతాయన్న వాదన సరికాదని, ఆ సెక్షన్ కేవలం సేవలకు సంబంధించిన అంశమని పేర్కొంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పంపకాలు తప్పనిసరి అని కోర్టు చెప్పింది. ఈ విషయంపై రెండు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశించింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. ఆస్తులు, అప్పులను రెండు రాష్ట్రాలు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) సమానంగా పంచుకోవాలని చెప్పింది. విభజనకు ముందు ఉన్న ఆస్తులను 52:48 ప్రకారం పంచుకోవాలని చెప్పింది. విభజన తర్వాత ఆస్తులు, అప్పులు ఇరు రాష్ట్రాలకు పంచాలని ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+