టీచర్లను పీఏలుగా నియమించొద్దు: తెలంగాణకు సుప్రీంకోర్టు

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ప్రభుత్వం ఉపాధ్యాయులను మంత్రులు, ఎమ్మెల్యేలకు వ్యక్తిగత సహాయకులు(పీఏ)గా నియమించొద్దని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. డిప్యుటేషన్‌పై పీఏలుగా పనిచేస్తున్న వారిని వెనక్కు పిలవాలని స్పష్టం చేసింది.

తెలంగాణలో 'జీరో స్కూల్స్'పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై నివేదికను అత్యున్నత న్యాయస్థానానికి అమికస్ క్యురీ అందజేసింది.

Supreme court asks Telangana government on Schools situation

ఎంఈవో, డీఈవో పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ పాఠశాలలపై ఎందుకు నమ్మకం కలిగించలేకపోతున్నారని అడిగింది.

అంతేగాక, అన్ని అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. 398 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంతో సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Supreme court asked Telangana government to submit a report on Schools situation.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి