సుప్రీంలో తెలంగాణ సర్కారుకు చుక్కెదురు: కులాల తొలగింపుపై నోటీసులు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బీసీ జాబితా నుంచి కళింగ, శెట్టి బలిజల కులాలను తెలంగాణ సర్కార్ తొలగించడాన్ని సవాల్ చేస్తూ కళింగ, శెట్టి బలిజ సంఘం సుప్రీంను ఆశ్రయించింది.
పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీం ధర్మాసనం సోమవారం విచారణ జరిపిన అనంతరం దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే గురువారాని (24వతేదీ)కి వాయిదా వేసింది.
తెలంగాణలో ఈఏడాది అడ్మిషన్లు పూర్తయినందున కళింగులకు రిజర్వేషన్లు కల్పించలేమని ప్రభుత్వం ప్రకటించడంతో కళింగ, శెట్టి బలిజ సంఘం సుప్రీంను ఆశ్రయించింది.

దానిని న్యాయస్థానం విచారించగా, అడ్మిషన్లు పూర్తయినందున కళింగులకు రిజర్వేషన్లు కల్పించలేమని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభమైనందున ఈ వాదనతో కోర్టు ఏకీభవించినట్లు తెలిసింది.
కొత్త డీజీపీగా నియామకానికి ఐదుగురి పేర్లు
కొత్త డీజీపీ నియామకానికి యూపీఎస్సీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు పేర్లను పంపింది. ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మ, నేషనల్ పోలీస్ అకాడమీ డీజీ అరుణ బహుగుణ, సీఆర్పీఎఫ్ డీజీ దుర్గాప్రసాద్, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, ఎస్పీఎఫ్ డీజీ తేజ్‌దీప్ కౌర్ పేర్లను ప్రభుత్వం పంపింది.












Click it and Unblock the Notifications