కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టి కేబినెట్‌లో మహిళలకు స్థానం: డికె అరుణ పిటిషన్‌ తోసిపుచ్చిన సుప్రీం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ సహా ఏడు రాష్ర్టాల మంత్రి వర్గాల్లో మహిళలకు స్థానం కల్పించాలంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత డికె అరుణ సుప్రీం కోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించలేమని కోర్టు స్పష్టం చేసింది. కేబినెట్లలో మహిళలకు స్థానం కల్పించి ఉంటే బాగుండేదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

అనుమానులన్నాయి.. కాళేశ్వరం ఎత్తిపోతలను పూర్తి చేయండి

కరీంనగర్/వరంగల్: కరీంనగర్‌ జిల్లా మహాదేవపూర్‌ మండలంలోని బీరసాగర్‌ వద్ద 500 కోట్ల వ్యయంతో చేపట్టిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఎత్తిపోతల పథకం పనులను ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని సీఎల్పీ నేత జానారెడ్డి కోరారు.

Supreme Court rejects DK Aruna's petition

గురువారం మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావులతో కలిసి పనులను పరిశీలించి.. మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ హయాంలో 2009లో స్థానిక రైతుల సంక్షేమం కోసం శ్రీధర్‌బాబు పోరాడి ఈ పథకాన్ని మంజూరు చేయించినట్లు తెలిపారు.

కాగా, తెలంగాణ పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరంగల్ నిస్సిగ్గుగా... నిర్లజ్జగా ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన సాగిస్నున్నారని, సంక్షేమం, అభివృద్ధిని విస్మరించి వాటాలు దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. వరంగల్‌ లోకసభ ఉప ఎన్నిక సన్నాహక సమావేశాల్లో భాగంగా వర్ధన్నపేట, భూపాలపల్లి నియోజకవర్గాల సమావేశాలు గురువారం జరిగాయి.

ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఆయన కుటుంబసభ్యులు కేవలం వాటాలు వచ్చే పనులకే మొగ్గు చూపుతూ వాటికే టెండర్లు ఆహ్వానిస్తున్నారని ఆరోపించారు. వరంగల్‌ లోకసభ ఉప ఎన్నిక నుంచే కెసిఆర్‌ పతనం ప్రారంభమవుతుందని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

ఎంపిపి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం

మెదక్ జిల్లాలోని సదాశివపేట ఎంపిపి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మి విజయం సాధించింది. ఎంతో ఉఠ్కంతతో జరిగిన ఈ ఎన్నికలలో లక్ష్మి వెంటే విజయం నడిచింది. టిఆర్ఎస్ సర్కారుకు రోజులు దగ్గర్లో పడ్డాయనడానికి ఈ విజయమే నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు.

English summary
Supreme Court rejected Congress MLA DK Aruna's petition on Telangana cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X