కొత్త రాష్ట్రమైన తెలంగాణలో ఈ పరిస్థితేంటి: సుప్రీం ఆగ్రహం, కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో 398 పాఠశాలల్లో 'సున్నా' శాతం అడ్మిషన్లపై సుప్రీం కోర్టు మంగళవారం నాడు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కొత్త రాష్ట్రమైన తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఏమిటని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు లేని పాఠశాలలు ప్రాణం లేని మనిషితో సమానమని వ్యాఖ్యానించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల భర్తీపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని 398 ప్రభుత్వ పాఠశాలల్లో సున్నా ప్రవేశాలపై సుప్రీం కోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

విద్యార్థుల ప్రవేశాలు జరగకపోవడానికి గల కారణాలతో నివేదికను నాలుగు వారాల్లో సమర్పించాలని కోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను ధర్మాసనం మే 10కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
విద్యార్థులు లేని స్కూళ్లు ప్రాణం లేని మనిషితో సమానమని, కొత్త రాష్ట్రమైన తెలంగాణలో ఇలాంటి పరిస్తితి ఏమిటని వ్యాఖ్యానించింది. పిల్లలు స్కూళ్లకు వచ్చేలా ప్రోత్సహించడం లేదని మండిపడింది. తమకు స్కూళ్లు మూసివేసే ఉద్దేశ్యం లేదని, టీచర్ పోస్టులు భర్తీ చేసే ఆలోచనలో ఉన్నామని తెలంగాణ ప్రభుత్వ లాయర్ చెప్పారు.












Click it and Unblock the Notifications