రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు భ్రష్టు పట్టించింది, జడ్జిలు దేవదూతలా: జెపీ

హైదరాబాద్: సుప్రీం కోర్టు తీర్పు పైన లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ శుక్రవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలీజియం వ్యవస్థను సుప్రీం కోర్టు సమర్థించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు.

ప్రజాస్వామ్యంలో జడ్జిలను హైకోర్టు నియమించే పద్ధతి లేదన్నారు. రాజ్యాంగాన్ని సుప్రీం కోర్టు భ్రష్టు పట్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు పైన సమగ్ర చర్చ జరగాలన్నారు. ఈ తీర్పు పైన తాము రాష్ట్రపతి, అన్ని పార్టీల నేతలను కలుస్తామని చెప్పారు.

వారిని వారే నియమించుకోవడానికి జడ్జిలు ఏం దేవదూతలు కాదని చెప్పారు. ఏ ప్రజాస్వామ్య దేశంలోను ఇలాంటి విధానం లేదన్నారు.

సుప్రీం కోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందన్నారు. కొలీజియం వ్యవస్థధను సుప్రీం సమర్థించడంపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు.

Supreme Court verdict on NJAC; This is no fullstop, more of a comma

కాగా, జడ్జీల నియామకంపై శుక్రవారం సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. పాత పద్ధతిలోనే జడ్జీల నియామకం జరగాలని సుప్రీం తేల్చి చెప్పింది. జడ్జీల నియామకంలో కేంద్రం జోక్యం న్యాయవ్యవస్థకు మంచిది కాదని స్పష్టం చేసింది.

ఎన్‌జేఏసి ఏర్పాటు నిర్ణయం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. జడ్జీల నియామకంపై కమిషన్ ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.

కాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్, న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఇప్పటిదాకా ఉన్న కొలీజియం వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసిన ప్రభుత్వం కొత్తగా ‘నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్ కమిషన్(ఎన్‌జేఏసి)'‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+