ప్రకాష్ రాజ్ దత్తత గ్రామం కొండారెడ్డిపల్లెలో సర్వే
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రముఖ సినీనటుడు ప్రకాష్‌రాజ్ దత్తత తీసుకున్న కొండారెడ్డిపల్లి గ్రామంలో సర్వేలు మొదలయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని ప్రకాష్‌రాజ్ దత్తత తీసుకున్న క్రమంలో గ్రామ అభివృద్ధికి పలురకాల సర్వేలు కొనసాగుతున్నాయి.
ప్రకాష్‌రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ గ్రామంలో 1680 మంది ఓటర్లు, 588 కుటుంబాలు ఉన్నాయి. మంచినీటి సమస్య, అండర్‌గ్రౌండ్ డైనేజీ వ్యవస్థ, సిసి రోడ్లు తది తర పనులు చేపట్టాల్సి ఉంది. గ్రామంలో ప్రకాష్‌రాజ్ ఫౌండేషన్ ప్రతినిధుల బృందం సభ్యులు సర్వే లు నిర్వహించడంతో పాటు మండల అభివృద్ధి అధికారి శివకామినితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

ప్రధాన సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజలకు ఆరోగ్య సం బంధమైన మెగా హెల్త్ క్యాంపును ఈనెల 17వ తేదీన ఏర్పాటు చేయాలని ఫౌండేషన్ ప్రతినిధులు నిర్ణయించుకున్నారు. గ్రామంలో పశువైద్యశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని ప్రకాష్‌రాజ్‌ను కోరాలని ప్రజలు అనుకుంటున్నారు.
ప్రకాష్‌రాజ్ సహకారంతో గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ పోలేపోగు రాజు తెలిపారు. ప్రకాష్‌రాజ్ దత్తతతోనైనా కొండారెడ్డిపల్లి తమ గ్రామం అన్నివిధాల అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నట్లు గ్రామస్థులు ఆశపడుతున్నారు.












Click it and Unblock the Notifications