సర్వే: కెసిఆర్ నెంబర్ వన్, 13వ స్థానంలో చంద్రబాబు

హైదరాబాద్: దేశంలోని ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సిఎం కె. చంద్రశేఖర రావు నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 13వ స్థానంలో నిలిచారు. శివరాజ్ చౌహాన్ రెండో స్థానంలో నిలువగా, రమణ్ సింగ్ మూడో స్థానంలో నిలిచారు.

ఆనంది బెన్ నాలుగో స్థానంలో, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐదో స్థానంలో నిలిచారు. ముఖ్యమంత్రుల పనితీరుపై ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన సర్వేలో కెసిఆర్‌కు ప్రథమ స్థానం లభించింది. దేశంలోని సిఎంల పనితీరుపై ప్రధాని మోడీ ప్రతి మూడు నెలలకోసారి త్రైమాసిక నివేదికలు తెప్పించుకుంటున్నారు. ప్రభుత్వ నిఘా సంస్థలతోపాటు, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా కూడా ఈ సర్వేలు కొనసాగుతున్నట్లు సమాచారం.

 Survey: KCR number one, Chandrababu in 13th place

ప్రజల్లో సంతృప్తస్థాయి ప్రాతిపదికన ఈ సర్వే నివేదికలు ఇస్తారని చెబుతున్నారు. ఆ ప్రకారం తాజా త్రైమాసిక సర్వే నివేదిక ప్రకారం.. దేశంలో ప్రజాభిమానం సంపాదించుకున్న ముఖ్యమంత్రుల్లో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి స్ధానం సాధించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 13వ స్థానంలో ఉన్నట్టు సమాచారం. బిజెపి పాలిత ముఖ్యమంత్రుల కన్నా కేసీఆర్ మొదటి స్థానంలో ఉండటం మరో విశేషం.

బిజెపిని వ్యతిరేస్తూ, తరచూ మీడియాకెక్కుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఐదవ స్థానం లభించడం గమనించగదగింది. బిజెపి సీఎం వసుంధరరాజే సింధియాకు 7వ స్థానం, జార్ఖండ్ బిజెపి ముఖ్యమంత్రి రఘువర్‌ప్రసాద్‌కు 14వ స్థానం లభించాయి. ఈనెల 16న ర్యాంకులపై అధికార ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+