• search
  • Live TV
రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎస్ఐ మృతిపై సిబి సిఐడి విచారణకు ఆదేశం: వారే చంపారని బంధువుల ఫిర్యాదు(పిక్చర్స్)

|

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్‌ఐ రమేశ్ మృతి వెనుక కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఎస్‌ఐ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్‌ఐ రమేశ్ మంగళవారం రాత్రి పెద్దెముల్ మండలం కందనపల్లి గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే.

కాగా, ఎస్‌ఐ రమేశ్‌ది ఆత్మహత్య కాదు.. హత్యేనంటూ కుటుంబ సభ్యులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై సిఐడి దర్యాప్తు జరిపించాలని మృతుడు ఎస్‌ఐ భార్య గీత డిమాండ్ చేశారు. అయితే సదరు డిమాండ్‌ను పోలీసులు కొట్టి పారేస్తున్నారు.

నల్గొండ జిల్లా దేవరకొండ మండలం శేరిపల్లి తండాకు చెందిన ఎస్‌ఐ రమేశ్ పెద్దెముల్ మండలంలో విధులు నిర్వహిస్తూ నాలుగు నెలల క్రితం యాలాల పోలీసు స్టేషన్‌కు బదిలీపై వచ్చాడు. గర్భవతైన భార్య గీతను మంగళవారం సాయంత్రం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అదే సమయంలో పదే పదే ఫోన్లు రావడంతో ఎవరి ఫోన్ అని భార్య ప్రశ్నించింది.

ఎస్ఐ అనుమానాస్పద మృతి

ఎస్ఐ అనుమానాస్పద మృతి

రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్‌ఐ రమేశ్ మృతి వెనుక కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఎస్‌ఐ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మృతిపై ఆందోళన

మృతిపై ఆందోళన

ఎస్‌ఐ రమేశ్ మంగళవారం రాత్రి పెద్దెముల్ మండలం కందనపల్లి గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే.

ఆత్మహత్య కాదు, హత్యే

ఆత్మహత్య కాదు, హత్యే

ఎస్‌ఐ రమేశ్‌ది ఆత్మహత్య కాదు.. హత్యేనంటూ కుటుంబ సభ్యులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

రమేష్ (ఫైల్ ఫొటో)

రమేష్ (ఫైల్ ఫొటో)

ఈ సంఘటనపై సిఐడి దర్యాప్తు జరిపించాలని మృతుడు ఎస్‌ఐ భార్య గీత డిమాండ్ చేశారు. అయితే సదరు డిమాండ్‌ను పోలీసులు కొట్టి పారేస్తున్నారు.

ఆత్మహత్య కాదు, హత్యే

ఆత్మహత్య కాదు, హత్యే

నల్గొండ జిల్లా దేవరకొండ మండలం శేరిపల్లి తండాకు చెందిన ఎస్‌ఐ రమేశ్ పెద్దెముల్ మండలంలో విధులు నిర్వహిస్తూ నాలుగు నెలల క్రితం యాలాల పోలీసు స్టేషన్‌కు బదిలీపై వచ్చాడు.

మంత్రి మహేందర్ రెడ్డి పరామర్శ

మంత్రి మహేందర్ రెడ్డి పరామర్శ

సిఐ, ఓ కేసులో నిందితుడైన లక్ష్మణ్‌నాయక్ కలసి ఎస్‌ఐ రమేశ్‌ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని బుధవారం భార్య గీత, కుటుంబ సభ్యులు తాండూరు ఆదనపు ఎస్పీ, డిఎస్పీలకు ఫిర్యాదు చేశారు.

ముదనపల్లి తండాకు చెందిన లక్ష్మణ్‌నాయక్ ఫోన్ అని.. అతనిపై గతంలో కేసుండేదని ఆ కేసుకు సంబంధించి పదేపదే ఫోన్ చేస్తున్నాడని ఎస్‌ఐ రమేశ్ తన భార్య గీతతో చెప్పాడు. అదే క్రమంలో సిఐ వెంకటరాములు ఎస్‌ఐకు ఫోన్ చేశారు. గణేశ్ ఉత్సవాల బందోబస్తుకు వెళ్లాలని చెప్పడంతో భార్యను ఆస్పత్రిలోనే వదిలిపెట్టి ఎస్‌ఐ రమేశ్ బందోబస్తుకు వెళ్లాడు.

కాగా, ఆయన మృతదేహం పెద్దముల్ మండలం కందనపల్లి శివారులో చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఇదిలావుండగా సిఐ, ఓ కేసులో నిందితుడైన లక్ష్మణ్‌నాయక్ కలసి ఎస్‌ఐ రమేశ్‌ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని బుధవారం భార్య గీత, కుటుంబ సభ్యులు తాండూరు ఆదనపు ఎస్పీ, డిఎస్పీలకు ఫిర్యాదు చేశారు. కుటుంబీకుల ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చడంతో గిరిజన విద్యార్థులు, గిరిజన సంఘాలు బుధవారం ఆందోళనకు దిగాయి.

రమేష్ మృతిపై సిబి సిఐడి విచారణకు ఆదేశం

కాగా, ఎస్ఐ రమేష్ మృతిపై సిబి సిఐడి విచారణకు తెలంగాణ ప్రభుత్వం గురువారం ఆదేశించింది. రమేష్ కుటుంబ పరిస్థితిని చూస్తే జాలేసిందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. డిపార్ట్‌మెంట్ మంచి ఎస్ఐని కోల్పోయిందని అన్నారు. ఇసుక మాఫియాపై అనుమానం ఉండటంతోనే విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

వాస్తవాలను బయటికి తీస్తామని వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వరంగల్ ఘటన దురదృష్టకరమని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. త్వరలోనే పోలీసు విభాగంలోని ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు.

English summary
Sub-inspector of Police of Yalala in Ranga Reddy district Ramavath Ramesh, who committed suicide, even worked as a labourer to continue his studies and realise his dream of becoming a government employee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X