చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ నుంచి బుద్ధితెచ్చుకో, నువ్వు తగ్గకుంటే:కమల్‌హాసన్‌కు పరిపూర్ణానంద హెచ్చరిక, సంచలన వ్యాఖ్యలు

తమిళ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేయాలనుకుంటున్న నటుడు కమల్ హాసన్‌పై రాష్ట్రీయ హిందూ సేన వ్యవస్థాపకులు, ప్రముఖ హిందూమత ప్రచారకులు పరిపూర్ణానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/చెన్నై: తమిళ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేయాలనుకుంటున్న నటుడు కమల్ హాసన్‌పై రాష్ట్రీయ హిందూ సేన వ్యవస్థాపకులు, ప్రముఖ హిందూమత ప్రచారకులు పరిపూర్ణానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

చదవండి: రేవంత్‌కు బిగ్ షాక్, రివర్స్: వెంట వచ్చిన వాళ్లు తిరిగి టీడీపీలోకి

కమల్ హాసన్‌ను దేశద్రోహిగా అభివర్ణించారు. ఆయనకు హిందూ సమాజం తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావును చూసి గుర్తు తెచ్చుకోవాలని, లేదంటే బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.

కమల్ హాసన్‌పై కేసు, పరిపూర్ణానంద స్పందన

కమల్ హాసన్‌పై కేసు, పరిపూర్ణానంద స్పందన

హిందూ ఉగ్రవాదం ఉందని కమల్ హాసన్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై యూపీలోని వారణాసిలో ఓ లాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ వ్యాఖ్యలపై పరిపూర్ణానంద ధీటుగా స్పందించారు.

డబ్బులు ఇవ్వకుంటే అలా మాట్లాడేవారా

డబ్బులు ఇవ్వకుంటే అలా మాట్లాడేవారా

హిందువులను తీవ్రవాదులని, హిందుత్వం ఒక భయంకర ఉగ్రవాదమని మాట్లాడే కుహానా మేధావులను చూశామని, కానీ కమల్ హాసన్ ఓ నటుడిలా మాట్లాడలేదని పరిపూర్ణానంద అభిప్రాయపడ్డారు. అతని సినిమాలను ఆదరించిన వారిలో హిందువులు కూడా ఉన్నారని, అందరూ డబ్బులు ఇవ్వకుంటే ఈ రోజు అలా మాట్లాడేవారా అని ప్రశ్నించారు. అతను కట్టే బట్ట, ఉండే నివాసం, ప్రస్తుతం అతని సుఖబోగాల జీవనంలో హిందూ సమాజం పాత్ర లేదా అని నిలదీశారు.

అప్పుడు ఆ బుద్ధి ఎక్కడకు పోయింది

అప్పుడు ఆ బుద్ధి ఎక్కడకు పోయింది

సినిమాలు తీసే సమయంలో ఇలాంటి మాటలు కమల్ హాసన్ ఎందుకు మాట్లాడలేదని, అప్పుడు బుద్ధి ఎక్కడకు పోయిందని పరిపూర్ణానంద నిలదీశారు. హిందూ ఉగ్రవాదమని పదేళ్ల క్రితం, ఇరవై ఏళ్ల క్రితం ఎందుకు సినిమా తీయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు నువ్వు నటుడిగా ఎదిగేందుకు హిందువులను తీవ్రవాదులు అంటావా అని మండిపడ్డారు.

నిన్న దేశద్రోహి నేడు ధర్మద్రోహి

నిన్న దేశద్రోహి నేడు ధర్మద్రోహి

కమల్ హాసన్‌కు దైవభక్తి లేదని, అది ఆయన వ్యక్తిగతమని పరిపూర్ణానంద అన్నారు. ఆస్తికుడైనా, నాస్తికుడైనా అందరం కలిసి ఉండాలన్నారు. కానీ కమల్ మాత్రం నాయకుడిగా ఎదిగేందుకు హిందువులను టార్గెట్ చేసుకున్నారని అభిప్రాయపడ్డారు. తాను నాయకుడిగా ఎదిగేందుకు మొన్న జనగణమనను కూడా అవమానించారని మండిపడ్డారు. జనగణమన అర్ధరాత్రి వేసుకోమని వ్యంగ్యంగా అన్నాడని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తి దేశద్రోహి కాదా, ఆయన మాటలు దేశాన్ని అవమానపరచడం కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు ధర్మద్రోహి కూడా అయ్యాడన్నారు. పవిత్రమైన హిందూ ధర్మాన్ని తీవ్రవాదం అనడం ఏమిటని, రెండు రోజులు పోతే హిందువులు ఉగ్రవాదులు అంటాడని ధ్వజమెత్తారు.

విశ్వరూపం ఆడలేదు, కానీ అది బయటపడింది, కమాల్ హసన్

విశ్వరూపం ఆడలేదు, కానీ అది బయటపడింది, కమాల్ హసన్

కమల్ హాసన్ నటించిన విశ్వరూపం సినిమా తీస్తే ఆడలేదని, కానీ ఇప్పుడు అతని విశ్వరూపం మాత్రం బయటపడిందని పరిపూర్ణానంద మండిపడ్డారు. ఆయన పేరు కమల్ హాసన్ కాదని, కమాల్ హసన్ అని ఎద్దేవా చేశారు. ఇతను పెద్ద ఉగ్రవాది అన్నారు.

సినిమాలు ఆడక పిచ్చోడు అయ్యాడు

సినిమాలు ఆడక పిచ్చోడు అయ్యాడు

కొన్నేళ్లుగా అతని సినిమాలు ఆడటం లేదని, ఎవరూ చూడటం లేదని దీంతో అతను పిచ్చివాడు అయ్యాడని పరిపూర్ణానంద మండిపడ్డారు. తన సినిమాలు ఆడితే అతను మామూలుగా ఉండేవాడని, కానీ సినిమాలు ఆడటం లేదు కాబట్టి పిచ్చివాడు అయ్యాడని, ఇది మానసిక వ్యాధి అన్నారు.

లోకల్ నాయకుడు-లోక నాయకుడు

లోకల్ నాయకుడు-లోక నాయకుడు

కమల్ హాసన్ లోకల్ నాయకుడిగా కూడా రుజువు చేసుకోలేకపోయాడని, ఇక లోక నాయకుడు ఎలా అవుతాడని పరిపూర్ణానంద ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల బరిలో దిగి అప్పుడు లోకల్ నాయకుడిగా నిరూపించుకోమనండని సవాల్ విసిరారు. హిందూ సమాజాన్ని వ్యతిరేకించి ఇలాంటి దద్దమ్మలకు ఎలా సమాధానం చెప్పాలో హిందూ సమాజానికి తెలుసునని చెప్పారు. ఇంతకాలం డబ్బు సంపాదించేందుకు హిందూ సమాజం కావాలని, కానీ ఇప్పుడు హిందువులు తీవ్రవాదులు అయ్యారా, హిందూ ధర్మం ఉగ్రవాదం అయిందా అని నిలదీశారు.

వందలమంది కమల్ హాసన్‌లు వచ్చినా, నటులు విటులుగా

వందలమంది కమల్ హాసన్‌లు వచ్చినా, నటులు విటులుగా

ఇలాంటి మాటలు మాట్లాడినందుకు నిన్ను ఏమీ చేయకుండా, కేవలం మీరు అన్న మాటలకు తిరిగి మాటలతో సమాధానం చెబితే మీరు రెచ్చిపోతున్నారని, మీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, దీనిని హిందూ సమాజం గుర్తిస్తోందని పరిపూర్ణానంద అన్నారు. మీరు హిందూ సమాజాన్ని గుచ్చిగుచ్చి గాయపర్చడాన్ని ప్రతి హిందువు గమనిస్తున్నాడని, దీనిపై కచ్చితంగా హిందూ సమాజం స్పందించి తీరుతుందన్నారు. ఇలాంటి వందల కమల్ హాసన్‌లు నటన ద్వారా సమాజాన్ని ఏం ప్రభావితం చేశారో తెలియదు కానీ నటులు మాత్రం విటులుగా మారుతున్నారని ధ్వజమెత్తారు. నటులు విటులుగా మారే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి మాటల కంటే దిగజారుడు వ్యాఖ్యలు లేవన్నారు.

ఎన్టీఆర్‌ను గుర్తు తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో

ఎన్టీఆర్‌ను గుర్తు తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో

ఎన్టీఆర్ వంటి నటుడు హిందూ ధర్మాన్ని, ఇతర మతాలను గౌరవించాడని పరిపూర్ణానంద అన్నారు. ఆయన ఏ మతాన్ని కించపరచలేదన్నారు. అది నిజమైన హిందూ లక్షణం అన్నారు. కమల్ హాసన్ బుద్ధి తెచ్చుకోవాలి లేదంటే గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు. అంతేకానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సమాజం, జాతి క్షమించదన్నారు.

తగ్గకుంటే సంహారప్రక్రియ ఉంటుందని హెచ్చరిక

తగ్గకుంటే సంహారప్రక్రియ ఉంటుందని హెచ్చరిక

నీ దిగజారుడు వ్యాఖ్యలను ఉపసంహరించుకోకుంటే సంహారప్రక్రియను హిందూ సమాజం చూపిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటుతుందన్నారు. తద్వారా మీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కమల్ వెనుక విషపూరిత ఆలోచనలు ఉన్నాయన్నారు.

English summary
Kakinada Sree Petham's Swami Paripoornananda reacted on actor Kamal Haasan comments on Hindus. He lashed out at Actor in a video.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X