రోడ్లపై గుంతలు.. బైక్ స్కిడ్డై పడిపోయిన స్వామిగౌడ్, కాలు ఫ్రాక్చర్
హైదరాబాద్: బైక్ స్కిడ్ అయి కిందపడటంతో బీజేపీ నేత స్వామి గౌడ్ కు గాయాలయ్యాయి. కాలు ఫ్యాక్చర్ అయ్యింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు ఆదివారం గండిపేట మండల పరిధిలో పార్టీ నాయకులు బైక్ ర్యాలీని నిర్వహించారు.
బీజేపీ నేత స్వామి గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కిస్మత్‌పూర్ లోని తన ఇంటికి వస్తుండగా రోడ్డు పైనున్న గుంతలలో బైక్ స్కిడ్ కావడంతో స్వామి గౌడ్ కింద పడిపోయారు. తలకు హెల్మెట్ ఉండటం వల్ల తలకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, బైక్‌పై నుంచి పడటంతో కాలు ఫ్రాక్చర్ అయినట్లుగా డాక్టర్లు తెలిపారు.

అయితే, ఈ ప్రమాదానికి రోడ్లపై గుంటలు పూడ్చని అధికారుల నిర్లక్ష్యమై కారణమని స్వామి గౌడ్ మండిపడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలకు గండిపేట మండల పరిధిలో రోడ్లు పూర్తిగా గుంతలమయపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఈ విషయాన్ని అధికారులకు పలుమార్లు సూచించినప్పటికీ ఏమాత్రం ఫలితం లేదని స్వామి గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video

వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని స్వామిగౌడ్ డిమాండ్ చేశారు.
ఆదివారంనాడు ఆజాదీకా అమృత్ మహాత్సవంలో భాగంగా బండ్లగూడ జాగీర్ పరిధిలో బీజేపీ తిరంగా ర్యాలీ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అక్కడ రోడ్లన్ని గుంతలమయంగా మారాయని,అదేవిధంగా మురికి నీరు రోడ్ల వెంట పారుతుందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్వామి గౌడ్ కోరారు.












Click it and Unblock the Notifications