Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంతో ఘొల్లుమన్న ఓరుగల్లు!!

స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారిలో ఐదుగురు ఓరుగల్లు బిడ్డలు కావటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది.

వరంగల్: సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సికింద్రాబాద్ ప్యారడైజ్ ప్రాంతంలోని బట్టల షాపులతోపాటు, పలు ప్రైవేట్ ఆఫీసులకు నిలయమైన స్వప్నలోక్ కాంప్లెక్స్ నిన్న సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదానికి గురైంది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా కష్టపడవలసి వచ్చింది.

స్వప్నలోక్ అగ్నిప్రమాదంలో ఓరుగల్లు బిడ్డలు
స్వప్నలోక్ కాంప్లెక్స్ లో ఏడో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రారంభమైన మంటలు భవనమంతటా వ్యాపించడంతో పాటు, ఐదవ అంతస్తులో పేలుడు సంభవించి మంటలు మరింత తీవ్రం అయ్యాయి. దీంతో అందులో చిక్కుకున్న ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. అయితే సికింద్రాబాద్లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదాన్ని మిగిల్చింది. ఓరుగల్లు బిడ్డలను ఈ దుర్ఘటన చిదిమేసింది.

Swapnalok Complex Fire accident: deceased 5 from warangal, Tragedy in joint Warangal District

ఐదుగురు ఉమ్మడి వరంగల్ జిల్లా కు చెందిన వారే
హైదరాబాద్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఐదుగురు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారే కావడంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాద ఘటనలో చనిపోయిన ఐదుగురు యువత కుటుంబాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ముగ్గురు, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు మృతి స్థానికంగా ఆవేదనకు గురిచేసింది.

Swapnalok Complex Fire accident: deceased 5 from warangal, Tragedy in joint Warangal District

వరంగల్ జిల్లాకు చెందిన మృతుల వివరాలు ఇవే
మహబూబాబాద్ మండలం సురేష్ నగర్ కు చెందిన 22సంవత్సరాల ప్రమీల, కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన 23సంవత్సరాల ప్రశాంత్, వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఖానాపూర్ తండాకు చెందిన 22ఏళ్ల బి శ్రావణి, నర్సంపేట మండలం మర్రిపల్లికి చెందిన 22ఏళ్ల వెన్నెల, నర్సంపేట కు చెందిన 22ఏళ్ల వి శివ మృతి చెందినట్టు పోలీసులు అధికారికంగా ధ్రువీకరించారు. వీరంతా దట్టమైన పొగ కారణంగా మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. పాతికేళ్లలోపు వయసున్న యువతీ యువకులు అందరూ కాల్ సెంటర్ బిఎం 5 లో పనిచేస్తున్న వారిగా గుర్తించారు.

Swapnalok Complex Fire accident: deceased 5 from warangal, Tragedy in joint Warangal District

అగ్నిప్రమాద ఘటనపై మంత్రి ఎర్రబెల్లి తీవ్ర దిగ్భ్రాంతి
ఇదిలా ఉంటే సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద ఘటన అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. ఆ ఘటనలో మృతి చెందిన వాళ్ళందరికీ మంత్రి నివాళులర్పించారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. ఆయా కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+