రాజేష్ మైకంలో భర్తను చంపుకొన్నా, అతను చెప్పినట్టే విన్నా: స్వాతి

Posted By:
Subscribe to Oneindia Telugu

రాజేష్ చెప్పినట్టు విని, తన భర్తను చంపుకొన్నానని స్వాతి పోలీసుల విచారణలో వెల్లడించారని సమాచారం. సినిమాలో జరిగినట్టుగానే జీవితంలో జరిగిపోతోందని భావించి రాజేష్ చెప్పినట్టుగానే విన్నానని నిందితురాలు స్వాతి పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.

స్వాతి భర్తను చంపడానికి కారణాలు ! అసహ్యం వేస్తోంది | Oneindia Telugu

రాజేష్, స్వాతి పారిపోవడానికి ప్లాన్, కానీ, 'నా కొడుకు చనిపోయాడు'

ప్రియుడు రాజేష్‌తో కలిసి భర్త సుధాకర్‌రెడ్డిని స్వాతి హత్య చేసింది. ఈ హత్య కేసు పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. ఈ కేసులో రాజేష్‌ను ఏ1 నిందితుడిగా, స్వాతిని ఏ 2 నిందితుడిగా పోలీసలు చేర్చారు.

ప్రియుడి కోసం పిల్లలకు దూరంగా, సుధాకర్‌రెడ్డికి గాయమిలా, రాజేష్‌కు స్వాతి గిప్ట్‌లు

ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు: ఐసీయూలో చీకట్లోనే, నోట్లో గుడ్డలతో, రాజేష్‌పై అనుమానమిలా..

సుధాకర్ రెడ్డిని చంపేసి అతడి స్థానంలో రాజేష్‌ ను తీసుకురావాలని స్వాతి ప్లాన్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే యాసిడ్ దాడి జరిగిందని ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్న సమయంలో స్వాతి, రాజేష్ ల వ్యవహరం బట్టబయలైంది.

ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు: ఆసుపత్రిలోనే రాజేష్ ఆత్మహత్యాయత్నం, అన్నా, స్వాతి ఎక్కడంటూ యాక్షన్...

రాజేష్ చెప్పినట్టే విన్నాను

రాజేష్ చెప్పినట్టే విన్నాను

తన ప్రియుడు రాజేష్ చెప్పినట్టే చేశానని స్వాతి పోలీసుల విచారణలో వెల్లడించారని తెలుస్తోంది 5 గంటలకు పైగా స్వాతిని ఈ కేసులో విచారించారు. సుధాకర్ రెడ్డి హత్య కేసుకు సంబంధించి పలు విషయాలపై పోలీసులు స్వాతిని విచారించారని సమాచారం.సుధాకర్ రెడ్డిని హత్య చేసేందుకు ఇంకా ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు స్వాతిని ప్రశ్నించారని తెలుస్తోంది.

రెండు రోజుల పాటు కోర్టు అనుమతి

రెండు రోజుల పాటు కోర్టు అనుమతి

సుధాకర్ రెడ్డి హత్య కేసులో స్వాతిని విచారించేందుకు పోలీసులు నాలుగు రోజుల పాటు పోలీసు కష్టడీ కోసం స్వాతిని కోరారు. అయితే కోర్టు మాత్రం రెండు రోజుల పాటు మాత్రమే స్వాతిని విచారించేందుకు అనుమతి ఇచ్చింది.రెండు రోజుల పాటు విచారణ పూర్తి చేసిన స్వాతిని మహబూబ్‌నగర్ జైలుకు తరలించారు.

హత్యకు ఉపయోగించిన దుస్తుల స్వాధీనం

హత్యకు ఉపయోగించిన దుస్తుల స్వాధీనం

హత్యచేసిన రోజున వారు వేసుకున్న దుస్తులు ఎక్కడ ఉన్నాయని ఆరాతీస్తే పూర్తి సమాధానం ఇవ్వలేదు. రాజేష్‌ దగ్గర ఉన్నట్లు చెప్పారు. రాజేష్‌ని విచారిస్తే స్వాతికే తెలుసని చెప్పాడు. ఈ సమాచారం కోసం మరోమారు విచారించినట్టు చెప్పారు.హత్య రోజును ఉపయోగించిన దుస్తులను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మొదటి రోజు ఈ విషయమై స్వాతిని విచారిస్తే సమాధానం దాటవేసింది. రెండోరోజున సుధాకర్ రెడ్డి,స్వాతి నివాసం ఉన్న ఇంట్లోని బీరువాలోనే దాచిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. స్వాతిని తీసుకెళ్ళి బీరువా తెరిచి ఈ దుస్తులను స్వాధీనం చేసుకొన్నారు.ఈ దుస్తులను పోలీసులు కోర్టుకు అందజేశారు.

పోలీసుల ఎదుట ఏడ్చిన స్వాతి

పోలీసుల ఎదుట ఏడ్చిన స్వాతి

పోలీసులు అడిగిన ప్రశ్నలకు స్వాతి ఎక్కువగా సమాధానాలు చెప్పలేదని సమాచారం. పోలీసులు అడిగిన ప్రశ్నలకు మౌనంగానే ఉందని తెలిసింది. అయితే పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించే సమయంలో స్వాతి ఏడ్చిందని సమాచారం. సుధాకర్ రెడ్డిని హత్య చేసేందుకు రాజేష్ మైకంలో ఉండడమే కారణమని పోలీసుల ముందు స్వాతి చెప్పినట్టు తెలిసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
nagarkurnool police custody completed, swathi police completed, nagarkurnool police police custody, swathi revealed sudhakar reddy murder case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి