చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముందేచెప్పిన ఇన్ఫోసిస్ టెక్కీ: హైద్రాబాద్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇది!

|
Google Oneindia TeluguNews

చెన్నై: నుంగంబక్కం రైల్వే స్టేషన్లో హత్య గావించబడిన ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి కేసు పైన పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీటీవీల ఆధారంగా నిందితుడి ఊహా చిత్రాన్ని గీయించే విషయం పైన చెన్నై పోలీసులు దృష్టి సారించారు.

ఊహాచిత్రం గీసేందుకు స్వాతి స్నేహితులు ముగ్గురు పోలీసులకు సహకరిస్తున్నారని తెలుస్తోంది. స్వాతిని చంపిన అజ్ఞాత వ్యక్తి గత రెండు వారాలుగా ఆమెను వెంబడించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాతి హత్య వెనుక ఏమైనా వ్యక్తిగత శతృత్వం ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

ఇన్ఫోసిస్ టెక్కీ హత్య: 'ఒక్కరూ కాపాడాలనుకోలేదు' ఇన్ఫోసిస్ టెక్కీ హత్య: 'ఒక్కరూ కాపాడాలనుకోలేదు'

తనను ఓ వ్యక్తి పదిహేను, నెల రోజులుగా అనుసరిస్తున్నాడని స్వాతి కొద్ది రోజుల క్రితం తన తండ్రికి చెప్పిందని, ఈ విషయాన్ని ఆయన చెప్పారని పోలీసులు అంటున్నారు. ఇదే విషయాన్ని పది రోజుల క్రితం స్నేహితులకు కూడా చెప్పింది.

ఇన్ఫోసిస్ టెక్కీ హత్య, హైదరాబాద్ ఫోరెన్సిక్ సాయం: స్వాతి ఫోన్ మిస్ ఇన్ఫోసిస్ టెక్కీ హత్య, హైదరాబాద్ ఫోరెన్సిక్ సాయం: స్వాతి ఫోన్ మిస్

Swathi’s last wish not fulfilled, says dad

నివేదిక పంపిన హైదరాబాద్ ఫోరెన్సిక్ సంస్థ

హైదరాబాదుకు చెందిన డిజిటల్ ఫోరెన్సిక్ సంస్థ మంగళవారం సాయంత్రం సీసీటీవీ ఫుటేజీకి చెందిన నివేదికను పంపించింది. ఇందులో నిందితుడు క్లియర్ చిత్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. అతని వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని గుర్తించారని తెలుస్తోంది.

హైదరాబాద్ డిజిటల్ ఫోరెన్సిక్ సంస్థ ఇచ్చిన ఆధారాలతోనూ ఊహాచిత్రం విడుదల చేయాలని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు ఏ రంగులో ఉన్నాడో కూడా పోలీసులకు ఆ రిపోర్ట్ ద్వారా తెలిసింది. నిందితుడు కోసం మూడు టీంలు పని చేస్తున్న విషయం తెలిసిందే.

English summary
The slain techie Swathi’s father is still inconsolable. While he may have reconciled to the fact that she will never return to the home she loved the most in her life, he repents that he could not fulfil a wish of his daughter whose life was brutally cut short on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X