తెలంగాణలోనూ భయపెడుతున్న సైకో సూదిగాళ్లు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజులుగా గుర్తుతెలియని వ్యక్తులు సూదులతో మహిళలపై దాడి చేస్తున్నటువంటి సంఘటనలు తెలంగాణలోనూ చోటు చేసుకుంటున్నట్లు కలకలం రేగుతోంది. ఈ సంఘటనల్లో ఏ మేరకు నిజం ఉందనేది తెలియదు. సోమవారం అలాంటి ఘటనలు రాష్ట్రంలో రెండు చోట్ల జరిగాయి.

నల్లగొండ జిల్లా కోదాడ మండలం కాపుగల్లుకు చెందిన రైతు కోపూరి వీర య్య సోమవారం సాయంత్రం కోదాడ నుంచి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు. ఎదురుగా ఓ ఆటో మీదికి దూసుకురావడంతో రోడ్డు పక్కకు నిలిపాడు.

ఆటోలోని ఓ వ్యక్తి తుపాకీని పోలిన పరికరాన్ని గురిపెట్టగా అందులో నుంచి వేగంగా వచ్చిన సూది కుడి కంటికింద గుచ్చుకుంది. చేతితో తడమగా సూది కనిపించిందని చెబుతున్నాడు.ఆటో అదేవేగంతో తిరిగి కోదాడ వైపు వెళ్లిందని, అందులో ముగ్గురు ఉన్నారని వీరయ్య తెలిపాడు. వెంటనే కోదాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు.

Syrenge

మరో ఘటనలో రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నల్లవెల్లితండాకు చెంది న స్వామినాయక్(31) బీఎన్‌రెడ్డినగర్‌లో ఉంటున్నాడు. సైఫాబాద్‌లోని ఎల్‌ఐసీ కార్యాలయంలో రీజినల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం సాయంత్రం సైఫాబాద్ నుంచి బీఎన్‌రెడ్డినగర్‌కు వెళ్లేందుకు బస్సు ఎక్కాడు.
ఎల్బీనగర్ సమీపంలోకి బస్సు రాగానే పక్కను న్న ఓ వ్యక్తి స్వామినాయక్‌కు ఇంజక్షన్ ఇచ్చి పారిపోయినట్లు చెబుతున్నాడు. స్వామినాయక్ ఎల్బీనగర్ చౌరస్తా వద్ద దిగి ఆరెంజ్ ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లాడు. సూది దాడి జరిగినట్లు అనవాళ్లు కన్పించలేదని వైద్యులు తెలిపారు.

అయినా, వైద్యం కొనసాగించేందుకు వైద్యులు ప్రయత్నించగా, తనకు హెల్త్‌ కార్డు ఉందని, దాని ఆధారంగా వైద్యం చేయించుకుంటానని అతను ఆ సుపత్రి నుంచి వెళ్లిపోయాడు. అయితే సూది దాడి జరిగిందని కచ్ఛితమైన ఆధారం లేకపోయినా సైకో సూది దాడి అంటూ కలకలం రేగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+