'టి ప్రభుత్వం చొరవను మోడీ అభినందించారు'
హైదరాబాద్: విద్యుత్ ఉత్పత్తి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్న ముఖ్యమంత్రి కార్యాలయం, నూతన ఆవిష్కరణలు, విద్యుత్ కోసం అనుసరిస్తున్న మార్గాలను ప్రధాని స్వాగతించారని తెలిపింది.
ఢిల్లీలో జరిగిన సాంప్రదాయేతర ఇంధన సదస్సులో తెలంగాణ విద్యుత్ విధానాలను మోడీ ప్రస్తావించారని తెలంగాణ పేర్కొంది. దేశంలో మెరుగైన ఫలితాలను సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి ప్రధాని మోడీ తెలిపారని వెల్లడించింది. సౌర విద్యుత్ లో తెలంగాణ చొరవకు మోడీ అవార్డు అందించినట్లు సిఎం కార్యాలయం తెలిపింది.

కాగా, ప్రధాని అధ్యక్షతన రెవనేబుల్ ఎనర్జీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ ఉత్పత్తి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నూతన విధానంను, ప్రాజెక్టులను సదస్సులో వివరించారు.
‘ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ఉపయోగంలో పోటీ పెరుగుతోంది. విద్యుత్ ఉత్పత్తిలో థర్మల్, సంప్రదాయేతర ఇంధన అవసరాలను ఉపయోగించుకోవాల్సిన అవసరముంది' అని తెలిపారు. ‘సిఎం చంద్రశేఖర్ రావు సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. గతంలో ఇందుకు సంబంధించి 500 మెగావాట్లకు బిడ్స్‌ను ఆహ్మానించారని తెలిపారు. అదేవిధంగా పవన విద్యుత్‌కు సంబంధించి పలు జిల్లాల్లో పరిశీలన చేయమని ఆదేశించారని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications