ఖమ్మం సభపై భారీ అంచనాలు - కాంగ్రెస్ దిశ మారుతోందా..!!

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ జోష్ మీద ఉండటం కొత్త పరిణామాలకు కేంద్రంగా మారుతోంది. ఇప్పుడు ఖమ్మం సభ పైన భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. భట్టి పాదయాత్రకు ముందు..తరువాత అన్నట్లుగా పార్టీలో మార్పు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు హైకమాండ్ ను కదలించింది. భట్టి పీపుల్స్ మార్చ్ ముగింపు సభకు రాహుల్ ను తరలి వచ్చేలా చేసింది. సభ ఏర్పాట్లలో ఇప్పుడు రేవంత్ ఎంట్రీ ఇవ్వటం మరో కొత్త చర్చకు కారణమవుతోంది.

ఖమ్మం సభకు భారీ ఏర్పాట్లు : ఖమ్మం సభకు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. రాహుల్ గాంధీ వస్తుండటంతో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. భట్టి పీపుల్స్ మార్చ్ యాత్ర ముగింపు.. పొంగులేటితో సహా పలువురు నేతలు పార్టీలో చేరిక కోసం కాంగ్రెస్ ఈ సభను నిర్వహిస్తోంది. భట్టి పాదయాత్ర ముగింపుకు ఈ సభ ద్వారా సరైన గుర్తింపు ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. భట్టిని పార్టీ తరపున రాహుల్ సత్కరించనున్నారు. ఖమ్మం వేదికగా పార్టీలో ముఖ్య నేతల చేరికలు జరగనున్నాయి.

battivikramarka

భట్టి తన యాత్రలో అన్ని వర్గాలతో మమేకం అయ్యారు. ఈ బాధల నుంచి విముక్తి కావాలంటే కాంగ్రెస్ పాలన...ఇందిరమ్మ రాజ్యం అవసరాన్ని వివరించారు. ఈ ఆదరణ కాంగ్రెస్ నేతలను కదలించింది. శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. నేతల ఐక్యత..ఆదరణ కాంగ్రెస్ హైకమాండ్ ను ఆకర్షించింది. భట్టి యాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ కు కారణమైన భట్టి యాత్ర ముగింపు సభకు రాహుల్ తరలి వస్తున్నారు.

భట్టికి రాహుల్ సన్మానం : ఖమ్మం సభలో రాహుల్ గాంధీ లక్షలాది మంది సమక్షంలో భట్టిని సన్మానించనున్నారు. ఖమ్మం సభపై పార్టీ సెంట్రల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. మేధావులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పార్టీకి పెరిగిన ఆదరణ..భవిష్యత్ కార్యాచరణ పైన వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఖమ్మం గర్జన తెలంగాణ రాజకీయ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు ఏర్పాట్లు..ప్రజల్లో ఆదరణ..కార్యకర్తల్లో జోష్ పైన అధికార బీఆర్ఎస్ లో ఆందోళన మొదలైంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా పొరుగు జిల్లాల పైన ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని ఇప్పటికే నిఘా సంస్థలు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. ఖమ్మం తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా తమ పట్టు జారుతోందనే ఆందోళన బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. ఖమ్మం సభ వేదికగా జరిగే చేరికలు.. రాహుల్ తెలంగాణ ప్రజల కోసం ఇవ్వనున్న హామీలు ఇప్పుడు ఎన్నికల వేళ బీఆర్ఎస్..బీజేపీకి సవాల్ గా మారుతున్నాయి.

rahulgandhi

రాహుల్ కీలక ప్రసంగం : ఖమ్మం సభ వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది. ఖమ్మం సభ నిర్వహణ పైన ఇప్పటి వరకు రేవంత్ అంటీ ముట్టనట్లు ఉన్నారు. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రే నేరుగా భట్టి వద్దకు వెళ్లి సభా నిర్వహణ పైన చర్చించారు. అ చర్చలకు పొంగులేటిని ఆహ్వానించారు. సభకు జనగర్జన గా అక్కడే పేరు ఖరారు చేసారు. థాక్రే రాష్ట్రంలోనే మకాం వేసారు. సభ జరిగే రోజున రాహుల్ వస్తుండటంతో టీపీసీసీ అధ్యక్షుడుగా సభ వరకు పరిమితం అయ్యేందుకు రేవంత్ సిద్దమయ్యారు. కానీ, మారుతున్న పరిణామాలు..

నేరుగా రాహుల్ టీం సభ పైన ఫోకస్ చేయటం.. సభ గ్రాండ్ సక్సెస్ అవ్వటం ఖాయంగా కనిపిస్తుండటంతో రేవంత్ ఖమ్మం బాట పట్టారు. ముందస్తు ఏర్పాట్ల పర్యవేక్షణకు రంగంలోకి దిగారు. ఆలస్యం చేస్తే అసలుకే మోసం వస్తుందని గ్రహించారు. ఇప్పుడు ఖమ్మం మొత్తం భట్టి పాదయాత్ర ముగింపు.. పొంగులేటి చేరిక కేంద్రంగా నిర్వహణకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+