వినూత్న ప్రచారంతో కాంగ్రెస్ దూకుడు - టార్గెట్ బీఆర్ఎస్..!!
తెలంగాణలో కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ పోరు రసవత్తరంగా మారుతోంది. మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని కేసీఆర్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా గెలవాలని..పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో..ఏ ఒక్క అవకాశం వదులుకోకూడదనేది కాంగ్రెస్ లక్ష్యం. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా ప్రచారం చేసుకుంటున్న పథకాల్లోని లోపాలు..అమలు కాని హామీలను ప్రజలు నిలదీస్తున్నట్లుగా వినూత్న ప్రచారంతో కాంగ్రెస్ సామాన్య ప్రజల్లోకి వెళ్తోంది.
శైలి మార్చిన కాంగ్రెస్ : తెలంగాణలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. కాంగ్రెస్ - బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లుగా మాటల తూటాలు పేల్చుతున్నాయి. తమ పథకాలే తమను తిగిరి గెలిపిస్తాయని గులాబీ పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇటు కాంగ్రెస్ ఈ సారి వినూత్న ప్రచారంతో దూసుకెళ్తోంది.

టీపీసీసీ చీఫ్ రేవంత్..స్టార్ క్యాంపెయినర్లు ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో అభ్యర్దుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కొత్త తరహా ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి మరో వినూత్న వీడియో విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ సామన్య ఓటర్లను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
వినూత్న ప్రచారంతో ముందుకు : కాంగ్రెస్ తన ప్రచారంతో ప్రధానంగా బీఆర్ఎస్ వైఫల్యాలను కళ్లకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు - ప్రజా నిర్లక్ష్యం పేరుతో మరో వినూత్న వీడియోను విడుదల చేసింది. ఇష్టారాజ్యంగా కారును నడుపుతూ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న కారును ఈ వీడియోలో పొందుపరిచారు.
బీఆర్ఎస్ వైఫల్యాల కారణంగా ఎనమిది వేల మంది రైతుల ఆత్మహత్యలు, కాళేశ్వరం స్కాంతో లక్ష కోట్ల రూపాలయ స్వాహా, రూ.5 లక్షల కోట్ల అప్పు, నిరుద్యోగంలో నంబర్ వన్, పుట్టే ప్రతి బిడ్డ మీద లక్షన్నర అప్పు, పెరిగిన ధరలతో సామాన్యుడి బతుకులు ఆగం వంటి ఆంశాలు ఈ వీడియోలో పొందుపరిచారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లలో ఆలోచన పెంచేలా ప్రచారం చేస్తున్నారు.
ఒక తాగుబోతు కారు నడుపుతే ఇలానే ఉంటది.
— Telangana Congress (@INCTelangana) November 9, 2023
పదేళ్ల అహంకారానికి చరమ గీతం పాడుదాం.#MaarpuKavaliCongressRavali pic.twitter.com/yZW0eKVYvP
టార్గెట్ బీఆర్ఎస్ హామీలు : పదేళ్ల అహంకారానికి చరమ గీతం పాడుదాం అంటూ కాంగ్రెస్ ఈ వీడియోలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఇలాంటి వీడియోల ద్వారా ప్రజల్లో అనూహ్య స్పందన కనిపిస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు. మార్పు కావాలి - కాంగ్రెస్ రావాలి అనే హ్యష్ టాగ్ తో కాంగ్రెస్ ప్రతీ ఒక్కరి దగ్గరకు తమ ప్రచారం వెళ్లేలా ప్లాన్ చేస్తోంది.#MaarpuKavaliCongressRavali అంటూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ వినూత్న ప్రచార వీడియోలు వైరల్ అవుతున్నాయి.
రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో ఇక పూర్తి స్థాయిలో ప్రచారం పైనే పార్టీ ముఖ్య నేతలు ఫోకస్ చేస్తారని చెబుతున్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పైన రేవంత్ పోటీకి దిగటంతో..రేపు అక్కడ పార్టీ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కామారెడ్డిలో పోలింగ్..ఫలితం పైన ఇప్పుడు ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications