Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైతుల అజెండా కాంగ్రెస్ జెండా - ఎన్నికల వేళ కొత్త వ్యూహం..!!

తెలంగాణలో రైతులకు అన్ని రకాలుగా మద్దతుగా నిలుస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. తమ పార్టీ ఫిలాసఫీలోనే రైతు సంక్షేమం ఉందని గుర్తు చేస్తున్నారు. ఉచిత విద్యుత్ పైన వివాదం వేళ కాంగ్రెస్ నేతలు తమ పార్టీ రైతుల కోసం తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేస్తోంది. ఉచిత విద్యుత్ తొలిగా అమల్లోకి తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని చెబుతున్నారు. పొలం పారటానికి ఉచిత విద్యుత్ మాత్రమే కాదు..దుక్కి దున్నడానికి భూమి ఇచ్చింది కూడా కాంగ్రెస్సేనని చెప్పుకొచ్చారు.

తెలంగాణలో ఎన్నికల వేడి పెరిగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఉచిత విద్యుత్ విషయంలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. దీనికి కాంగ్రెస్ తిప్పి కొడుతోంది. అసలు రైతు రుణమాఫీ దేశ వ్యాప్తంగా అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ సొంతమని..ఉచిత విద్యుత్ తొలిగా అమల్లోకి తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తు చేస్తున్నారు.

T Congress moving with Farmers supporting agenda to fix BRS in Difference ahead Assembly Elections

రైతులు, మహిళలు, దళితులు, బీసీలు ఇలా అందరి సంక్షేమం మొదలైంది కాంగ్రెస్ హాయంలో..పక్కాగా కొనసాగించేది కాంగ్రెస్ ప్రభుత్వంలోనేనని నినదిస్తున్నారు. అన్ని వర్గాల కోసం కాంగ్రెస్ అమలు చేసిన ఆ స్కీంలే కాపీ కొడుతూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని..ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తోంది అదనని ఆరోపిస్తున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ ఇప్పటి వరకు అమలు చేయలేదనేది కాంగ్రెస్ ఆరోపణ. మభ్య పెట్టే మాటలు..ప్రచార ఆర్భాటాలతో ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కాంగ్రెస్ నేతలు వరుస ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ కు పార్టీ కట్టుబడి ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణలో ఎక్కడ రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందుతోందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

సవాళ్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి సమాధానం లేదు. రైతలుకు దుక్కి దున్నటానికి భూములు ఇచ్చింది కాంగ్రెస్. రైతులకు సీలింగ్ యాక్ట్ కింద భూమిని పంచింది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక పైనే కాంగ్రెస్ సీఎంగా వైఎస్సార్ ఉచిత విద్యుత్ పైన తొలి సంతకం చేసారని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

మహిళలు..దళితులు..విద్యార్ధుల సంక్షేమానికి కాంగ్రెస్ తీసుకొచ్చిన స్కీంలే నేటికి అమలు అవుతున్నాయని నేతలు వివరించారు. పేదలకు ఆరోగ్య శ్రీ తో కార్పోరేట్ వైద్యం కాంగ్రెస్ విధానం. విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్ మెంట్ కాంగ్రెస్ కమిట్మెంట్ గా పేర్కొన్నారు.

కాంగ్రెస్ అమలు చేసిన పథకాలనే తప్పని పరిస్థితుల్లో అమలు చేస్తూ తన గొప్పతనం గా ప్రచారం చేసుకుంటున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. తెలంగాణ ఏర్పడి దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నా.. రైతులకు చేస్తామని చెప్పిన రుణమాఫీ ఇప్పటికే అమలు కాలేదని నిలదీస్తున్నారు. సంక్షేమం కాంగ్రెస్ పేటెంట్ గా పేర్కొంటున్న నేతలు.. రైతుకు నాడు..నేడు ఏనాడైనా అండగా నిలిచేది కాంగ్రెస్ నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+