భైంసా అల్లర్లలో హిందువులపై టీ సర్కార్ కక్ష్య సాధింపు.!హైకోర్ట్ తీర్పును స్వాగతించిన బండి సంజయ్.!
హైదరాబాద్ : భైంసా అల్లర్లలో నలుగురిపై పి.డి యాక్టు విధించడం సరికాదన్నారు ఎంపీ, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. టీఆర్ఎస్ సర్కార్ కక్ష సాధింపు చర్యలపై హైకోర్టు సీరియస్ అయ్యిందని, తక్షణమే న్యాయస్థానం నలుగురిని విడుదల చేయాలని తీర్పునిచ్చిందని అన్నారు. దీంలో బండి సంజయ్ స్పందిస్తూ ధర్మం గెలిచిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మొదటి నుండీ ఎంఐఎం కు కొమ్ముకాస్తూ హిందువుల ప్రయోజనాలను కాలరాస్తోందని మండిపడ్డారు.

కోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చెంప పెట్టి.. తీర్పును స్వాగతిస్తున్నామన్న బండి సంజయ్..
భైంసా అల్లర్ల విషయంలో నలుగురు హిందువులపై టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా పి.డి యాక్టు కింద నిర్బంధించడాన్ని తప్పుపడుతూ సోమవారం హైకోర్టు కేసు కొట్టివేయడాన్ని బిజెపి తెలంగాణ స్వాగతించింది. ధర్మం కోసం, న్యాయం కోసం కోర్టులో వాదించిన న్యాయ వాదులకు ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్. టీఆర్ఎస్-ఎంఐఎం ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా హిందువులపై కక్షసాధింపు కిందనే పి.డి యాక్టు విధించిన విషయం కోర్టు తీర్పుతో వెల్లడైంది. భైంసా అల్లర్లు జరిగిన సందర్భంలో 26 మంది హిందువులపై 30 అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేసారు.

రాజకీయ కక్ష్యలున్నాయి.. ఆ నలుగురిని విడుదల చేయాలన్న న్యాయస్థానం..
వీరిలో లింగోజి, రాకేష్, విజయ్, క్రాంతిలపై పి.డి యాక్టును రాష్ట్ర ప్రభుత్వం విధించిందని గుర్తు చేసారు బండి సంజయ్. ఈ నలుగురికి కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యగా పి.డి యాక్టు నమోదు చేయడంతో ఇన్ని రోజులుగా జైలులోనే ఉన్నారన్నారు. భైంసాలో నలుగురిపై పి.డి యాక్టు విధించిన విషయంలో రాజకీయ కక్షసాధింపు ఉన్నట్టుగా తాము భావిస్తున్నామని కోర్టు ఈరోజు వ్యాఖ్యానించిందని, వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసిందని, తెలంగాణ రాష్ట్రంలో పి.డి యాక్టు దుర్వినియోగం అవుతోందని బండి సంజయ్ తెలిపారు.

పీడి యాక్టును దుర్వినియోగం చేస్తున్న టీ సర్కార్.. ఘాటు వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్
అసాంఘీక శక్తుల మీదు ప్రయోగించాల్సిన ఈ చట్టాన్ని ఒక వర్గాన్ని సంతృప్తి పరచడం కోసం హిందువులపై ముఖ్యంగా బిజెపి, హిందూవాహిణి, విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలపై ప్రయోగిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. పి.డి యాక్టు, అక్రమ కేసులు బనాయించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుంటుందని, పోలీసు అధికారులను టీఆర్ఎస్ నాయకులు బెదిరించి, ఒత్తిడితో బిజెపిపై అక్రమ కేసులను పెట్టిస్తున్నారని అన్నారు. మత ఘర్షణల సందర్భంలో పరస్పర దాడులు జరిగినా హిందువులపైనే ఈ కేసులు నమోదు చేసి, చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు బండి సంజయ్.

హిందువులపై కావాలనే కేసులు.. టీ సర్కార్ మూల్యం చెల్లిస్తుందన్న బండి సంజయ్
భైంసా అల్లర్ల విషయంలో హిందువులపై పెట్టిన కేసులన్నీ అక్రమ కేసులేనని. ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్నప్పుడు బిజెపి నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి, టీఆర్ఎస్ నాయకులకు కొందరు పోలీసు అధికారులు వంతపాడడం దురదృష్టకరమని బండి సంజయ్ విచారం వ్యక్తం చేసారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు, అధికారులు స్వతంత్రంగా వ్యవహరించాలని హితవు పలికారు. భారత రాజ్యాంగం పోలీసులకు కల్పించిన హక్కులను దుర్వినియోగపర్చవద్దని బండి సంజయ్ కుమార్ పోలీసులకు విజ్ఞప్తి చేసారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications