‘అవకాశల గని, త్వరలో టీ హబ్ రెండో దశ’: జడ్‌ఎఫ్‌తో ఒప్పందం
హైదరాబాద్: త్వరలో రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ టీ హబ్‌ను ప్రారంభించనున్నట్టు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఆటో మొబైల్ రంగాల్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

మంత్రి కెటిఆర్
సాఫ్ట్‌వేర్‌తో సమానంగా ఐటీ, ఆటో మొబైల్, ఇంజినీరింగ్ రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్న దృష్ట్యా భవిష్యత్తులో డ్రైవర్ లేకుండా కార్లు, బస్సులు తిరుగుతాయని తెలిపారు. విశ్వనగరంగా ఎదుగుతున్న భాగ్యనగరం వైపు ఆటోమొబైల్, ఇంజనీర్ కంపెనీలు చూస్తున్నాయని చెప్పారు.

జడ్‌ఎఫ్ తో ఒప్పందం
టీ-హబ్ ఇన్నోవేట్ ఫర్ డిజిటల్ ఇండియా ఛాలెంజ్ 2.0ను ఆయన గురువారం ప్రారంభించారు. గచ్చిబౌలిలోని హయత్ హోటల్లో జరిగిన జడ్‌ఎఫ్ గ్రూప్ సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. కాగా, మంత్రి కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్ ఇండియా టెక్నికల్ సెంటర్(ఐటీసీ) ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన జడ్‌ఎఫ్ గ్రూప్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదిరింది.

మంత్రి కెటిఆర్ హర్షం
ఒప్పందం పత్రాలను ఐటీశాఖ కార్యదర్శి జయేష్‌రంజన్, జడ్‌ఎఫ్ గ్రూప్ ఇండియా సీనియర్ మేనేజర్ మమతా చామర్తి మార్చుకున్నారు. నగరంలో నెలకొల్పబోయే జడ్‌ఎఫ్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ కంపెనీలో 2020 నాటికి 2,500 ఇంజినీరింగ్ నిపుణులు పనిచేయబోవడం సంతోషకరమని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు.

అవకాశాల గని
ఐటీ రంగాన్నే కాకుండా ఆటోమొబైల్ రంగానికి కూడా ప్రభుత్వం ప్రోత్సహం ఇస్తుందని వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తే అన్ని సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో అన్ని రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలనిమంత్రి కోరారు.












Click it and Unblock the Notifications