ఒప్పందం కుదిరింది: టీ హబ్‌లో బ్రిటన్ స్టార్టప్ దిగ్గజం లెడ్ మ్యాక్ (ఫోటోలు)

హైదరాబాద్: టీ హబ్‌పై బ్రిటన్ (యూకే) ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని, ఇజ్రాయెల్ తరహా సహాయానికి సంసిద్ధత తెలిపిందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీ హబ్‌ను బ్రిటన్‌కు చెందిన బిజినెస్, ఇన్నోవేషన్ ఆండ్ స్కిల్స్ శాఖమంత్రి సాజిద్ జావిద్ గురువారం సందర్శించారు.

రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖమంత్రి కేటీఆర్ బ్రిటన్ మంత్రి సాజిద్ జావెద్‌కు టీ హబ్‌కు సంబంధించిన వివరాలను తెలియజేశారు. పెట్టుబడులకు ఊతమిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చేప్టటిన పారిశ్రామిక విధానాన్ని కేటీఆర్ ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

టీ హబ్‌లో స్టార్టప్ విద్యార్థులతో ఈ సందర్భంగా కాసేపు బ్రిటన్ మంత్రి పలు అంశాలపై చర్చించారు. టీ హబ్ ప్రాంగణంలో ఇరుదేశాల మంత్రుల సమక్షంలో అధికార బృందం టీ హబ్‌తో ఇంగ్లాండ్‌కు చెందిన ఎల్‌ఈడీ మ్యాక్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

అనంతరం మంత్రి కేటీఆర్ బ్రిటన్ మంత్రితో సమావేశమయ్యారు. ఆ తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ టీహబ్‌తో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నట్లు జావిద్ చెప్పారన్నారు. దానితో పాటు గేమింగ్, ఐటీ, లైఫ్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, యానిమేషన్, రక్షణ రంగాల్లో కలిసి పనిచేసేందుకు అవకాశాలున్నాయని స్పష్టం చేశారు.

ఒప్పందం కుదిరింది: టీ హబ్‌లో బ్రిటన్ స్టార్టప్ దిగ్గజం లెడ్ మ్యాక్

ఒప్పందం కుదిరింది: టీ హబ్‌లో బ్రిటన్ స్టార్టప్ దిగ్గజం లెడ్ మ్యాక్

లెడ్‌మ్యాక్ సీఈవో సర్ఫరాజ్ హసన్, టీహబ్ సీఈవో జయ్ కృష్ణన్‌ల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా స్టార్టప్‌ల రంగంలో వస్తున్న అంతర్జాతీయ పరిణామాలను టీ హబ్‌లోని ఔత్సాహికులకు అందించేందుకు అవకాశం లభిస్తుంది.

ఒప్పందం కుదిరింది: టీ హబ్‌లో బ్రిటన్ స్టార్టప్ దిగ్గజం లెడ్ మ్యాక్

ఒప్పందం కుదిరింది: టీ హబ్‌లో బ్రిటన్ స్టార్టప్ దిగ్గజం లెడ్ మ్యాక్

లండన్ ప్రధాన కేంద్రంగా ఉన్న విద్యా సేవల కంపెనీగా ఎల్‌ఈడీ మ్యాక్‌కు పేరుంది. ఇంక్యుబేటర్ కేంద్రాలకు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు దన్నుగా నిలవడంలో ఎల్‌ఈడీ మ్యాక్ అత్యున్నత స్థానంలో ఉంది.

ఒప్పందం కుదిరింది: టీ హబ్‌లో బ్రిటన్ స్టార్టప్ దిగ్గజం లెడ్ మ్యాక్

ఒప్పందం కుదిరింది: టీ హబ్‌లో బ్రిటన్ స్టార్టప్ దిగ్గజం లెడ్ మ్యాక్

రాబోయే పదేళ్లలో భారతదేశంలో లక్షమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దేందుకు లిడ్‌మ్యాక్ కంకణం కట్టుకున్నది. లండన్ బిజినెస్ స్కూల్, ఐఐఎం బెంగళూరు, కోజికోడ్, లక్నోలతో ఒప్పందం కుదుర్చుకున్నది.

ఒప్పందం కుదిరింది: టీ హబ్‌లో బ్రిటన్ స్టార్టప్ దిగ్గజం లెడ్ మ్యాక్

ఒప్పందం కుదిరింది: టీ హబ్‌లో బ్రిటన్ స్టార్టప్ దిగ్గజం లెడ్ మ్యాక్

భారతదేశ విద్యార్థులకు బ్రిటన్‌లో స్టార్టప్‌ల అవగాహన సదస్సులు ఏర్పాటుచేయడంలో కూడా ఎల్‌ఈడీ మ్యాక్‌కు పేరుంది. ఈ ఒప్పందం ద్వారా టీ హబ్ ప్రపంచ ప్రమాణాలతో ఔత్సాహికులకు సేవలు అందించనుంది. రాష్ట్ర ఐటిశాఖ సెక్రెటరీ జయేష్ రంజన్, టీ హబ్ సీఈఓ జయ్ కృష్ణన్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+