గెలుపునకు ‘సక్సెస్’ చదవాలి: రాజయ్య(పిక్చర్స్)

హైదరాబాద్: ప్రతీ ఓటమిని నిరాశతో స్వీకరిస్తూ ఓడిపోవడానికి సిద్ధపడే వారు... గెలవడం కోసం, ఓటమిని ఓడించడం కోసం ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ‘సక్సెస్ సక్సెస్' అని తెలంగాణా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి టి రాజయ్య అన్నారు. ప్రముఖ రచయిత విజయార్కె, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్, టి వేణుగోపాల్ రెడ్డి సంయుక్తంగా రచించిన ‘సక్సెస్ సక్సెస్' వ్యక్తిత్వ వికాస పుస్తకాన్ని సచివాలయంలోని తన చాంబర్‌లో రాజయ్య ఆవిష్కరించారు.

విద్యారత్న, లయన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు, నేటి యువతకు ఈ పుస్తకం మార్గదర్శిగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణా రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఈ పుస్తకాన్ని అంకితం ఇస్తున్నట్లు పుస్తక రచయితలలో ఒకరైన వేణు గోపాల్ రెడ్డి చెప్పారు. సక్సెస్ అనే ఆయుధం మరెక్కడో లేదు.. మనలో వున్న ఆత్మ విశ్వాసమే సక్సెస్...గెలిచే వరకూ పోరాడడమే సక్సెస్...ఈ రెండు సక్సెస్‌లు మీ వెంట వుంటే జీవితాన్ని జయించినట్టేనని ప్రముఖ రచయిత విజయార్కె అన్నారు.

పదిరోజుల్లో మహిళా పోలీస్ స్టేషన్: కెటిఆర్

తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తుందని ఐటి మంత్రి కెటి రామారావు అన్నారు. ఐటి కారిడార్‌లో పదిరోజుల్లో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గురువారం జరిగిన నాస్కామ్ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాస్కామ్ సమావేశం వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని అన్నారు. మహిళా రక్షణ కమిటీ ఇతర దేశాల్లో పర్యటించి నివేదిక ఇస్తుందని తెలిపారు.

హైదరాబాద్‌లో వైఫై ఏర్పాటుకు టెండర్లు పిలిచామని కెటిఆర్ చెప్పారు. ఐటి పరిశ్రమపై త్వరలో వర్క్‌షాప్ నిర్వహిస్తామని, మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. వరంగల్, కరీంనగర్‌లలోనూ ఐటి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. తమది పారిశ్రామిక ఫ్రెండ్లీ ప్రభుత్వమని కెటిఆర్ చెప్పారు.

అర్హులైన రైతుల రుణాలు మాఫీ: ఈటెల

అర్హులైన రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ జరుగుతుందని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వకపోగా విమర్శిస్తున్నాయని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన 36వేల చెరువుల మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి ఈటెల తెలిపారు.

డిప్యూటీ సిఎం రాజయ్య

డిప్యూటీ సిఎం రాజయ్య

ప్రతీ ఓటమిని నిరాశతో స్వీకరిస్తూ ఓడిపోవడానికి సిద్ధపడే వారు... గెలవడం కోసం, ఓటమిని ఓడించడం కోసం ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ‘సక్సెస్ సక్సెస్' అని తెలంగాణా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి టి రాజయ్య అన్నారు.

కెటిఆర్

కెటిఆర్

తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తుందని ఐటి మంత్రి కెటి రామారావు అన్నారు. ఐటి కారిడార్‌లో పదిరోజుల్లో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

కెటిఆర్

కెటిఆర్

గురువారం జరిగిన నాస్కామ్ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాస్కామ్ సమావేశం వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని అన్నారు.

కెటిఆర్

కెటిఆర్

మహిళా రక్షణ కమిటీ ఇతర దేశాల్లో పర్యటించి నివేదిక ఇస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో వైఫై ఏర్పాటుకు టెండర్లు పిలిచామని కెటిఆర్ చెప్పారు.

ఈటెల

ఈటెల

అర్హులైన రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ జరుగుతుందని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

ఈటెల

ఈటెల

యుద్ధ ప్రాతిపదికన 36వేల చెరువుల మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి ఈటెల తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+