మున్నూరు రవికి జైలు శిక్ష!: ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, త్వరలోనే ఎత్తివేస్తామన్న మంత్రులు..

మహబూబ్ నగర్/హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై నమోదైన కేసులు ఇంకా వారిని వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం (టీఆర్‌ఎస్వీ) రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, టీఆర్‌ఎస్‌ నేత మున్నూరు రవికి 6నెలల జైలు శిక్ష పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ ఉద్యమ సమయంలో.. 2012 సెప్టెంబరు 26న నిర్వహించిన ఓ భారీ నిరసన ర్యాలీలో పోలీస్ విధులకు ఆటంకం కలిగించారన్న కారణంగా గతంలో రవిపై కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన మహబూబ్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి దీప్తి.. రవికి ఆర్నెళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించారు.

కోర్టు తీర్పుతో రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకోగా.. తనకు రెండు రోజుల గడువు ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీంతో శనివారం లోగా ఇద్దరు సాక్షులను ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు.

ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు:

ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు:

మున్నూరు రవికి జైలు శిక్ష పడటంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అధికారంలోకి వస్తే ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తామన్న టీఆర్ఎస్.. ఇప్పుడు మాత్రం వారిని కోర్టుల చుట్టూ తిప్పించుకుంటుందని కొంతమంది ఆరోపించారు. ఇదేనా ఉద్యమకారులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే గౌరవం అని ప్రశ్నించారు.

మరోవైపు టీఆర్ఎస్ నేతల వాదన మాత్రం మరోలా ఉంది. సాక్షాత్తు హోంమంత్రి నాయిని నరసింహరెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకే కోర్టు తిప్పలు తప్పట్లేదని, నిజంగా వాళ్ల చేతిలో పనే అయితే రైల్వే పేషీలకు ఇప్పటికీ ఎందుకు హాజరవుతారని వారు ప్రశ్నిస్తున్నారు.

త్వరలోనే ఎత్తివేస్తామని ప్రకటన..:

త్వరలోనే ఎత్తివేస్తామని ప్రకటన..:

టీఆర్ఎస్ కార్యకర్తగా, కేసీఆర్ వీరభిమానిగా ముద్రపడ్డ మున్నూరు రవి అరెస్ట్ ఆ పార్టీపై తీవ్ర విమర్శలకు తావివ్వడంతో ప్రభుత్వం అప్రత్తమైంది. ఈ మేరకు సచివాలయంలోని మంత్రి నాయిని కార్యాలయంలో డీజీపీ మహేందర్‌ రెడ్డి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్‌ త్రివేది, న్యాయశాఖ ముఖ్యకార్యదర్శి నిరంజన్‌ రావు ఇతర అధికారులతో మంత్రులు శుక్రవారం సమీక్ష నిర్వహించారు.తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసుల్లో మెజారిటీ కేసుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తి వేసిందని, పెండింగ్‌లో ఉన్న కొద్దిపాటి కేసులను కూడా త్వరలోనే ఎత్తివేస్తామని మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌ రెడ్డి, కేటీఆర్‌ తెలిపారు.

సాంకేతిక కారణాల వల్లే:

సాంకేతిక కారణాల వల్లే:

కేసులను ముందే ఎందుకు ఎత్తివేయలేదన్న ప్రశ్నకు సాంకేతిక కారణాలే సమాధానంగా చెబుతోంది ప్రభుత్వం. కొన్ని కేసుల్లో 'ఉద్యమ సమయంలో నమోదైన కేసు' అని పేర్కొనకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తిందని అంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న అన్ని కేసులను ఇప్పటికే మాఫీ చేసినట్టు డీజీపీ తెలిపారు. సాంకేతిక కారణాలు, సమాచార లోపం వల్ల కొన్ని కేసులు మిగిలి ఉన్నాయని వాటిని త్వరలో ఎత్తివేయాలని అధికారులకు మంత్రులు సూచించారు.

మరోసారి సమావేశం

మరోసారి సమావేశం

ఉద్యమ కేసులకు సంబంధించి త్వరలోనే మరో సమావేశం నిర్వహించాలని మంత్రులు నిర్ణయించారు. ఈ మేరకు రెండు వారాల్లో పోలీస్‌ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న ఉద్యమ కేసుల పూర్తి వివరాలను తీసుకుని రావాలని డీజీపీ మహేందర్‌ రెడ్డికి మంత్రులు సూచించారు.

పార్టీ వైపు నుంచి కూడా సమాచారం సేకరిస్తామని, ఇదంతా క్రోడీకరించి మరోసారి సమావేశమై ఈ కేసుల్ని ఎత్తివేసే చర్యలు తీసుకుంటామని మంత్రులు తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను డీజీపీ కార్యాలయంలోని ఒక సీనియర్‌ అధికారి పర్యవేక్షిస్తారని, సాధ్యమైనంత త్వరలో అన్ని కేసులను మాఫీ చేస్తామని మంత్రులకు డీజీపీ వివరించారు.

కేసుల సమాచారం అందించడానికి..:

కేసుల సమాచారం అందించడానికి..:

ఉద్యమ కేసులకు సంబంధించి ఇప్పటికీ 1136జీవోలను జారీ చేశామని, తద్వారా వేలాదిమంది ఉద్యమకారులు కేసుల నుంచి విముక్తి పొందారని మంత్రి నాయిని తెలిపారు. మరో 19కేసులకు సంబంధించిన ఫైళ్లు వివిధ దశల్లో ఉన్నాయని, త్వరలోనే అవి కూడా క్లియర్ అవుతాయని అన్నారు. ఉద్యమ కేసులకు సంబంధించిన సమాచారం అందించడానికి, మెయిల్, ఫోన్ నంబర్స్ అందుబాటులోకి తెచ్చారు.
వాటి వివరాలు:
[email protected]
8143726666-వాట్సాప్ నంబర్
[email protected]
04023451073/1072

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+