నాలుక చీరేస్తారు, చెంప చెళ్లుమనే తీర్పు: తలసాని, సునామీ అని కెటిఆర్

హైదరాబాద్/వరంగల్: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి వరంగల్ ప్రజల మరోసారి పట్టంకాట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వరంగల్ లోకసభ ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ ఫలితాలు కెసిఆర్ పాలనపై నమ్మకాన్ని తెలియజేశాయని అన్నారు.

టిఆర్ఎస్ ప్రభుత్వంపై, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే నాలుక చీరేస్తామని ప్రజలు మరోసారి నిరూపించారని చెప్పారు. ఇందుకు ఈ తీర్పే నిదర్శనమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏ ఎన్నికలకైనా సిద్ధమేనని అన్నారు. ఉప ఎన్నికల్లోనైనా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనైనా టిఆర్ఎస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

గ్రేటర్ ఎన్నికల్లోనూ ఇదే ప్రభంజనం ఉంటుందని తలసాని అన్నారు. ఆరోపణలు చేసిన వారికి ఈ తీర్పు చెంప ఛెళ్లుమనింపించందని అన్నారు. ఇకనైనా బాధ్యతతో మాట్లాడాలని విపక్షాలకు ఆయన సూచించారు. కెసిఆర్ పంపిన వ్యక్తిగా సామాన్య అభ్యర్థి దయాకర్ భారతదేశ చరిత్రలో నిలిపోతారని అన్నారు. రైతులకు భవిష్యత్‌లో 9గంటల విద్యుత్ ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ ఉప ఎన్నికలో జాతీయ పార్టీలకు డిపాజిట్లు రాలేదంటే సిగ్గు చేటని అన్నారు. కొన్ని పత్రికలు ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచురిస్తున్నాయని, చెప్పులు వేశారని, నిలదీశారని అబద్ధపు రాతలు రాస్తున్నాయని మండిపడ్డారు. కెసిఆర్ నాయకత్వం, ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం ఉందని ఈ తీర్పు తెలియజేస్తుందని అన్నారు. కేంద్రాన్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు.

 Talasani and KTR on Warangal by poll results

సునామీలో కొట్టుకుపోయారు: కెటిఆర్

వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించిన ఓటర్లకు మంత్రి కెటి రామారావు కృతజ్ఞతలు తెలిపారు. భారీ మెజార్టీతో ఇచ్చిన ఓటర్ల తీర్పుతో ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. ఈ స్ఫూర్తివంతమైన తీర్పుతో మరింత బాధ్యతతో పని చేస్తామని కెటిఆర్ తెలిపారు.

వరంగల్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ సునామీ సృష్టించిందని, ఈ సునామీలు జాతీయ పార్టీలు కొట్టుకుపోయాయని అన్నారు. 16 నెలల పాలనపై ప్రజల నమ్మకమే ఈ తీర్పు అని చెప్పారు. వరంగల్ ప్రజలు చైతన్యవంతమైన తీర్పు ఇచ్చారని అన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా పథకాలు అమలు చేస్తామని అన్నారు. నారాయణ ఖేడ్‌ ఉప ఎన్నికలోనూ టిఆర్ఎస్ గెలిచితీరుతుందని కెటిఆర్ చెప్పారు.

జాతీయ పార్టీలకు తెలంగాణలో స్థానం లేదని మరోసారి ప్రజలు చాటి చెప్పారని మరో మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభంజనం సృష్టిస్తుందని అన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకమే వరంగల్ ప్రజల తీర్పు అని ఎంపి బాల్క సుమన్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+