సాయం చేస్తామని తలసాని
హైదరాబాద్: బంగారు భవిత ఉన్నయువత జాగ్రత్తగా వ్వవహరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. మూడు రోజుల క్రితం హుస్సేన్ సాగర్ చెరువులో ఈతకని వెళ్ళిన విద్యార్థి మృతి చెందిన సంగతి తెలిసిందే. నగరంలోని విక్టోరియా గంజ్ కు చెందిని వికాస్ అనే విద్యార్ధి 10వ తరగతి చదువుతున్నాడు. స్నేహితులతో కలసి హుస్సేన్ సాగార్ లో ఈతకు వెళ్లి దురదృష్టవశాత్తూ చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి తలసాని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా బుధవారం మంత్రి వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన నివాసంలో ప్రభుత్వం తరపున రూ.3లక్షల చెక్కును వికాస్ తల్లితండ్రులకు.. నియోజికవర్గం ప్రజల సమక్షంలో మంత్రి అందించారు.












Click it and Unblock the Notifications