భారీ వర్షం, ఎవరం ఏం చేయలేం: తలసాని, 'ఆ దారిలో వెళ్లకండి'
ప్రస్తుతం ఉన్న నాలాలు నిజం కాలం నాటివి అని, ఒక్క రోజులో వాటిని మార్చలేమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం అన్నారు. హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న నాలాలు నిజం కాలం నాటివి అని, ఒక్క రోజులో వాటిని మార్చలేమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం అన్నారు. హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే.

ఎవరం ఏం చేయలేం
దీనిపై తలసాని సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నిన్నటి వర్షంతో ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలిసిందని చెప్పారు. నాలాలు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భారీ వర్షం కురిసిందని, ఎవరం ఏం చేయలేమని చెప్పారు. అయినా గంటలో అంతా సర్దుకుందని చెప్పారు.
Recommended Video


కేటీఆర్‌కు విజ్ఞప్తి
భారీ వర్షాలు కురిసినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని చెప్పారు. నగర ప్రజాప్రతినిధులతో ఏ భేటీ ఏర్పాటు చేయాలని తాను మంత్రి కెటిఆర్‌ను కోరుతున్నానని చెప్పారు.

ఆ దారిలో వెళ్లకండి
సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలో జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, బంజారాహిల్స్, పంజాగుట్ట మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీహిల్స్-పంజాగుట్ట మార్గంలో ప్రయాణించవద్దని వాహనదారులకు జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తుగా సూచిస్తున్నారు. కేబీఆర్ పార్క్ వద్ద భారీగా వర్షపు నీరు నిలిచింది.

భారీ ట్రాఫిక్ జామ్
మాదాపూర్, గచ్చిబౌలిలో కురిసిన వర్షానికి ప్రధాన రోడ్లు, కాలనీ అంతర్గత రోడ్లు జలమయమయ్యాయి. మాదాపూర్‌లో పలు అపార్ట్‌మెంట్ సెల్లార్లలోకి వరద నీరు చేరి వాహనాలు మునిగిపోయాయి. ఉదయం నుంచి కొండాపూర్, మాదాపూర్, అయ్యప్పసొసైటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.












Click it and Unblock the Notifications