బాబు గతి ఏమౌతుందో రేపోమాపో చూస్తారు, కృష్ణ గతే: తలసాని

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గతి ఏమవుతుందో రేపోమాపో చూస్తారని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం చంద్రబాబు పైన నిప్పులు చెరిగారు.

దర్యాఫ్తు సంస్థలు విచారణను ముమ్మరం చేశాయని చెప్పారు. తప్పు చేస్తే ప్రజాస్వామ్యంలో మినహాయింపులు ఉండవని చెప్పారు. దేశద్రోహం కేసులో కృష్ణయాదవ్ గతంలో మూడేళ్లకు పైగా జైలు శిక్షను అనుభవించారని, ఇప్పుడు ఆయన సరసన చంద్రబాబు చేరుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో పాటు పలు ఆరోపణలు చేస్తూ ఢిల్లీ పెద్దలకు చంద్రబాబు లేఖ రాశారని తలసాని అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు ఒత్తిడిలో ఉన్నాడన్నారు. దేశమంతా తిరిగి తెలుగు ప్రజల పరువు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.

Talasani says Chandrababu is another Krishna Yadav!

చంద్రబాబు ఫోన్‌ను ట్యాపింగ్ చేశారంటూ తమ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలకు నిరూపించాలని సవాల్ చేశారు. చంద్రబాబు ఏపీ ప్రజలను అడ్డం పెట్టుకొని బయటపడాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు దుర్మార్గ నైజాన్ని ఏపీ ప్రజలు తెలుసుకోవాలన్నారు.

హైదరాబాదు నగరంలో శాంతిభద్రతలకు ప్రమాదం వాటిల్లిందంటూ చంద్రబాబు ప్రధాని మోడీకి లేఖ రాయడాన్ని తలసాని తప్పుపట్టారు. ఏడాది కాలంలో సీమాంధ్రులు హాయిగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారన్నారు.

హైదరాబాదులో సెటిలర్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. చంద్రబాబు మాటలను హైదరాబాదులోని సెటిలర్స్ పరిగణలోకి తీసుకోరని చెప్పారు.

కేసీఆర్ పైన రమణ ఆగ్రహం

కేసీఆర్ పైన తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ ధ్వజమెత్తారు. ఓటుకు నోటు వ్యవహారంలో కేసీఆర్ వైఖరి వల్ల రాజకీయ గందరగోళం ఏర్పడందన్నారు. రేవంత్ కేసు విషయంలో కేసీఆర్ ఫిర్యాదుదారుగానే కాకుండా విచారణాధికారిగా, చివరకు జడ్జిగాను మారిపోయారని ఆరోపించారు. అధికారం అడ్డు పెట్టుకొని నచ్చని వారి పైన కక్ష సాధిస్తున్నారన్నారు. అసలే కోతి, ఆపై కల్లు తాగిన చందంగా కేసీఆర్ తీరు ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+