ఎంత నీచుడివో, దుర్గార్గుడివో: చంద్రబాబుపై విరుచుకుపడ్డ తలసాని
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ధ్వజమెత్తారు. నోటుకు ఓటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు భద్రతను సాకుగా చూపుతున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అంతకు ముందు భద్రత గురించి ఎప్పుడైనా చంద్రబాబు ఫిర్యాదు చేశారా అని ఆయన అడిగారు.
నువ్వు ఎంత నీచుడివో, దుర్మార్గుడివో అందరికీ తెలుసునని ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్ారు. చంద్రబాబు సమస్యలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, అందరూ అమాయకులని అనుకుంటున్నారని తలసాని అన్నారు. చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారనే విషయాన్ని హైదరాబాదులో నివాసం ఉంటున్న ప్రజలు గుర్తించాలని ఆయన అన్నారు.

హైదరాబాద్‌లో ఆంధ్ర ప్రజలకు ఢోకా లేదని, చంద్రబాబు మాయ మాటలు నమ్మోద్దని పిలుపునిచ్చారు. చంద్రబాబు తప్ప చేసి దొరికి పోయాననే నిస్పృహలో చంద్రాబు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తెలుగు ప్రజల మధ్య సమస్యలు సృష్టించేందుకు బాబు చూస్తున్నారు. ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
చంద్రబాబుకు ఇది పరీక్షా సమయమని, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రాజీనామా చేయాల్సిందేనని తలసాని అన్నారు. నిప్పునంటున్న చంద్రబాబు తప్పుకుని విచారణకు సిద్ధపడాలని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, నోటుకు ఓటు కేసులో చట్టం తన పని తాను చేసుకుని పోతుందని బిజెపి తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్‌లకు మానసిక ప్రశాంతత అవసరమని ఆయన శనివారం వ్యాఖ్యానించారు. తాము రాజకీయ విలువలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
రాజకీయ విద్వేషాలు ఇరు రాష్ట్రాలకు కూడా మంచివి కావని కిషన్ రెడ్డి అన్నారు. సెక్షన్ 8 అనేది గవర్నర్ పరిధిలోకి వస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పరిస్థితులను కేంద్రానికి వివరించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications