నాకు పూజ చేయండి, 4రోజులు రాజకీయం పక్కన పెడ్తే ఏం జరుగుతుందో..: తలసాని
హైదరాబాద్: పొద్దున లేస్తే శ్రీనివాస్ యాదవ్ అంటున్నారని, లేకుంటే తన చుట్టూ తిరుగుతూ పూజలు చేసుకోండని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళారం నాడు ఎద్దేవా చేశారు. తన రాజీనామా పైన వచ్చిన విమర్శల పైన ఆయన స్పందించారు.
తాను ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని, ఎవరు వస్తారో రండని సవాల్ చేశారు. మోసాలు చేయడం కాంగ్రెస్, టిడిపిలకే చెల్లుతుందన్నారు. తాను ప్రెస్ మీట్ పెట్టి మరీ మీకు రాజీనామా లేఖను చూపించానని, ఆ తర్వాత దానిని డిసెంబర్ 16వ తేదీన ఇచ్చానని చెప్పారు.

కావాలంటే చూడండి.. రాజీనామా లేఖను జేబులో పెట్టుకొని తిరుగుతున్నానని చెప్పి, దానిని చూపించారు. పద్ధతి ప్రకారం సభాపతి ముందుకు వెళ్తారని చెప్పారు. తాను ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, మంత్రిగా చేశానని, తనకు పదవులు కొత్త కాదన్నారు. తాను అమెరికాకు వెళ్లినప్పుడు అందరూ మాట్లాడారన్నారు.
రాజకీయాలు పక్కన పెట్టి, నాలుగు రోజులు తనది కాదనుకుంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని హెచ్చరించారు. తాను భయపడి మాట్లాడటం లేదన్నారు. తన గురించి మాట్లాడితే అందరి చిట్టా విప్పుతానని చెప్పారు.












Click it and Unblock the Notifications