వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాంధీ ఆసుపత్రిలో జూడాల ఆందోళన(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా రూరల్ సర్సీస్ విషయంలో జూడాలకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదం నేపధ్యంలో గాంభీ ఆస్ప్రతిలో జూనియర్ వైద్యులు సమ్మె నిర్వహిస్తున్నారు. గాంధీలో జూనియర్ వైద్యుల ఆందోళన ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఇందులో బాగంగా మంగళవారం కూడా జూడాలు విధులకు గైర్హాజరై ర్యాలీ నిర్వహించారు.

కొద్దిరోజులుగా వీరి ఆందోళన కొనసాగుతున్నా, రోగులకు అంతంతమాత్రంగానే ఇబ్బందులు తలెత్తాయి. కానీ పండుగ తర్వాత ప్రారంభమైన మొట్టమొదటి పనిరోజైన మంగళవారం రోగులు స్వల్పంగా ఇబ్బందుల పాలయ్యారు.

న్యాయమైన తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని నినాదాలు చేస్తూ జూనియర్ వైద్యులు కళాశాల నుంచి ఆస్పత్రి ఆవరణ వరకు మంగళవారం ఊరేగింపు నిర్వహించారు. అప్పటికపుడు వైద్యులను చూపించుకుని వెళ్లిపోయే ఔట్ పేషెంటు విభాగంలోని రోగులకు పెద్దగా సమస్యలు తలెత్తకపోయినా, ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్న రోగుల సహాయకులు ఆందోళన చెందుతున్నారు.

ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధి పి. శ్రీనివాస్ మాట్లాడుతూ తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. అలాగే ప్రభుత్వ వైద్యులకు సమానంగా తమకు జీతాలు చెల్లించటంతో పాటు వివిధ ఆస్పత్రుల్లో తాము ప్రశాంతంగా విధులు నిర్వహిస్తూ రోగులకు సేవ చేసేందుకు అనుకూలమైన వాతావరణాన్ని, భద్రత ప్రమాణాలను సమకూర్చాలని డిమాండ్ చేశారు.

తమ డిమాండ్లను నెరవేర్చుతున్నట్లు ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చే వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతుందని వారు తేల్చి చెప్పారు. జూనియర్ డాక్టర్ల ఆందోళన కారణంగా వైద్య సేవలు స్తంభించకుండా ఉండేందుకు గాను ఇప్పటికే ఉస్మానియా ఆస్పత్రి ఉన్నతాధికారులు పిజి విద్యార్థులు, సీనియర్ వైద్యుల సేవలను వినియోగించుకుంటున్నారు.

గాంధీలో జూడాల ఆందోళన, రోగుల ఇబ్బందులు

గాంధీలో జూడాల ఆందోళన, రోగుల ఇబ్బందులు

గత కొన్ని రోజులుగా రూరల్ సర్సీస్ విషయంలో జూడాలకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదం నేపధ్యంలో గాంభీ ఆస్ప్రతిలో జూనియర్ వైద్యులు సమ్మె నిర్వహిస్తున్నారు.

గాంధీలో జూడాల ఆందోళన, రోగుల ఇబ్బందులు

గాంధీలో జూడాల ఆందోళన, రోగుల ఇబ్బందులు

గాంధీలో జూనియర్ వైద్యుల ఆందోళన ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఇందులో బాగంగా మంగళవారం కూడా జూడాలు విధులకు గైర్హాజరై ర్యాలీ నిర్వహించారు.

గాంధీలో జూడాల ఆందోళన, రోగుల ఇబ్బందులు

గాంధీలో జూడాల ఆందోళన, రోగుల ఇబ్బందులు


కొద్దిరోజులుగా వీరి ఆందోళన కొనసాగుతున్నా, రోగులకు అంతంతమాత్రంగానే ఇబ్బందులు తలెత్తాయి. కానీ పండుగ తర్వాత ప్రారంభమైన మొట్టమొదటి పనిరోజైన మంగళవారం రోగులు స్వల్పంగా ఇబ్బందుల పాలయ్యారు.

గాంధీలో జూడాల ఆందోళన, రోగుల ఇబ్బందులు

గాంధీలో జూడాల ఆందోళన, రోగుల ఇబ్బందులు

న్యాయమైన తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని నినాదాలు చేస్తూ జూనియర్ వైద్యులు కళాశాల నుంచి ఆస్పత్రి ఆవరణ వరకు మంగళవారం ఊరేగింపు నిర్వహించారు.

 గాంధీలో జూడాల ఆందోళన, రోగుల ఇబ్బందులు

గాంధీలో జూడాల ఆందోళన, రోగుల ఇబ్బందులు

ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధి పి. శ్రీనివాస్ మాట్లాడుతూ తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.

English summary
The talks between Telangana Junior Doctors Association (JUDA) and Director, Medical Education, failed to resolve the crisis and junior doctors decided to intensify their agitation from Tuesday till the government agrees to rescind the GO 107 which makes it mandatory for them to serve one year in rural areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X