వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ అదానీ.. హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్లో ప్రకంపనలు; బీఆర్ఎస్ వాయిదా తీర్మానం!!

|
Google Oneindia TeluguNews

బిఆర్ఎస్ పార్టీ మొదటినుంచి బిజెపికి అనుకూలంగా ఉన్నట్టుగా భావిస్తున్న అదానీ గ్రూపు సంస్థల అధినేత్ గౌతమ్ ఆదానీని టార్గెట్ చేస్తుంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో బీజేపీ అంబానీ, అదానీ వంటి కార్పోరేట్లకు మేలు చేస్తూ సామాన్య ప్రజలకు అన్యాయం చేస్తున్నారని అనేక సందర్భాల్లో ఆరోపించింది బీఆర్ఎస్. ఇక తాజాగా గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్స్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు వేదికగా అదానీ గ్రూప్ ను టార్గెట్ చేస్తోంది.

మొన్న బ్లూమ్‌బెర్గ్.. ఇప్పుడు ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్10 నుండి దిగజారిన అదానీ!!మొన్న బ్లూమ్‌బెర్గ్.. ఇప్పుడు ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్10 నుండి దిగజారిన అదానీ!!

పార్లమెంట్ లో అదానీ ప్రకంపనలు.. బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

పార్లమెంట్ లో అదానీ ప్రకంపనలు.. బీఆర్ఎస్ వాయిదా తీర్మానం


అదానీ గ్రూపు సంస్థలపై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ షేర్లను పతనానికి తీసుకువెళుతోంది. స్టాక్ మార్కెట్ ని షేక్ చేస్తూ అదానీ వ్యవహారం కొనసాగుతుంది. ఇక ఈ నేపథ్యంలో భారత పారిశ్రామిక దిగ్గజమైన గౌతమ్ అదానీని టార్గెట్ చేస్తూ అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై పార్లమెంట్లో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు పార్టీ ఎంపీ కేశవరావు ఈరోజు రాజ్యసభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

 పార్లమెంట్ రెండు సభల్లోనూ అదానీ హిండెన్ బర్గ్ నివేదికపై చర్చకు బీఆర్ఎస్ పట్టు

పార్లమెంట్ రెండు సభల్లోనూ అదానీ హిండెన్ బర్గ్ నివేదికపై చర్చకు బీఆర్ఎస్ పట్టు


భారత స్టాక్ మార్కెట్ పైనే కాకుండా, భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపెడుతున్న అదానీ వ్యవహారాన్ని పార్లమెంట్ వేదికగా చర్చించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అదానీ గ్రూపు పై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన బి ఆర్ ఎస్ దేశ ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం చూపే రీతిలో హిండెన్ బర్గ్ నివేదిక ఉందని వాయిదా తీర్మానంలో ప్రస్తావించింది. ఇక దీనిపై రూల్ 267 కింద చర్చ జరపాలని కోరింది. అటు పార్లమెంటులోని ఎగువ సభ లోక్సభలోను ఇదే అంశంపై చర్చ జరపాలని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

 ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ కూడా టార్గెట్ అదానీ

ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ కూడా టార్గెట్ అదానీ


అదానీ గ్రూపు ఆర్థిక అవకతవకలపై చర్చించాలని మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి. మొత్తానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక షేక్ చేస్తుంది. స్టాక్ మార్కెట్ లోనే కాదు, ఇటు పార్లమెంట్ లోనూ అదానీ ప్రకంపనలు కొనసాగుతున్నాయి.

 అఖిలపక్ష సమావేశంలోనూ ఆదానీని టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు

అఖిలపక్ష సమావేశంలోనూ ఆదానీని టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు


పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న క్రమంలో అఖిలపక్ష సమావేశంలోనూ దాని అంశాన్ని ప్రతిపక్షాలు లేవలెత్తాయి. అదానీ గ్రూప్ కి సంబంధించి హిండెన్ బర్గ్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో, ఈ నివేదికపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లో అవకతవకలకు పాల్పడుతోందని, అకౌంటింగ్ మోసాలు చేస్తోందని హిండెన్ బర్గ్ ఆరోపించింది. దీనిపై రెండేళ్ల పాటు పరిశోధన చేసి విడుదల చేసిన రిపోర్టు ప్రస్తుతం అదానీ సంస్థలను పతనానికి తీసుకు వెళ్తుంది. ఇక దీనికి ప్రతిస్పందనగా అదానీ గ్రూప్ కూడా 413 పేజీల రెస్పాన్స్ ను విడుదల చేసింది.

 పార్లమెంట్ వేదికగా అదానీ వ్యవహారంలో బీజేపీని ఇరకాటంలో పెట్టే పనిలో ప్రతిపక్షాలు

పార్లమెంట్ వేదికగా అదానీ వ్యవహారంలో బీజేపీని ఇరకాటంలో పెట్టే పనిలో ప్రతిపక్షాలు


అయినప్పటికీ హిండెన్ బర్గ్ తన నివేదికను సమర్థించి మరోమారు అదానీ గ్రూప్ పై విరుచుకుపడింది. జాతీయవాదాన్ని అడ్డుపెట్టుకొని అదానీ గ్రూప్ భారీ మోసాలకు పాల్పడుతోందని మరోమారు ఆరోపించింది. ఇక అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు విపరీతంగా పడిపోతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం పార్లమెంట్లోనూ ప్రకంపనలు రేపుతోంది. గౌతమ్ అదానీ టార్గెట్ గా అన్ని రాజకీయ పార్టీలు బిజెపిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

English summary
Adani Hindenburg report continues to stir in Parliament. The opposition is targeting the Adani issue and putting the BJP in trouble. BRS has given adjournment motion for discussion on Adani issue in both houses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X