సోనియాకు రాజగోపాల్ లేఖ -టార్గెట్ రేవంత్: జైలు పాలైన వ్యక్తితో పని చేయలేను..!!
కాంగ్రెస్ కు దూరమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోనియా గాంధీకి లేఖ రాసారు. అందులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైన ప్రధానంగా ఫిర్యాదులు చేసారు. తన రాజీనామా కారణాలను వివరించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామ ప్రకటించిన రాజగోపాల్ స్పీకర్ కు లేఖ ఇచ్చేందుకు సమయం కోరారు. ఈ నెల 7వ తేదీ వరకు స్పీకర్ అందుబాటులో ఉండకపోవటంతో, 8న తన రాజీనామా లేఖ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా..రాజకీయ నిర్ణయం వెనుక గల కారణాలను వివరిస్తూ సోనియాకు రాసిన లేఖలో వివరించారు.

మీ పై వ్యక్తిగత విమర్శలు చేసారు
సోనియా గాంధీకి రాసిన లేఖలో 30 ఏళ్లుగా కాంగ్రెస్ లో శుక్షితుడైన కార్యకర్తగా ఏ పని అప్పగించినా రాజీ పడకుండా.. కష్టాలు - కన్నీళ్లు దిగమింగుకుంటూ పార్టీ ప్రతిష్ఠ కోసం ప్రస్థానం కొనసాగించానని రాజగోపాల్ పేర్కొన్నారు. కొంత కాలంగా పార్టీకి విధేయులైన వారిని అడుగడుగునా అవమానిస్తూ.. విస్మరిస్తూ.. పార్టీ ద్రోహులు, మీ పైనే వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తులకు కీలక పదవులు ఇవ్వటం తనను బాధించిందని వివరించారు. ఇప్పటికే అనేక పార్టీలు మార్చి, స్వలాభం కోసం ఒక ప్రజాప్రతినిధిం చేయకూడని పనులు చేసి జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో తాను పని చేయలేనని లేఖలో రాజగోపాల్ తేల్చి చెప్పారు.

పార్టీని నిర్వీర్యం చేశారంటూ
తెలంగాణ అంటేనే ఆత్మ గౌరవం..ఆత్మాభిమానం అనేది తెలియని విషయం కాదని పేర్కొన్నారు. అందరి చొరవతో సాకారమైన తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ చేతిలో బందీ అయిందని ఆ లేఖలో వివరించారు. ఈ బంది నుంచి విడిపించేందుకు మరో ప్రజా స్వామిక పోరాటం అవసరమని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించలేని వ్యక్తులు.. గెలిచిన ఎమ్మెల్యేల్లో మనోధైర్యం నింపి కార్యాచరణ రూపొందించలేక, కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేశారంటూ లేఖలో పేర్కొన్నారు.

మరో రాజకీయ పోరాటం దిశగా
తెలంగాణలో ప్రజాస్వామిక పాలన అందించే దిశగా మరో రాజకీయ పోరాటం చేయాలని నిర్ణయించి.. కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవితో పాటుగా.. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాసిన లేఖలో వివరించారు. ఇప్పుడు ఈ లేఖలో ఎక్కువగా రాజగోపాల్ టీపీసీసీ చీఫ్ రేవంత్ ను టార్గెట్ చేస్తూ సోనియా గాంధీకి లేఖ రాసినట్లుగా స్పష్టమవుతోంది. ఇక, ఇప్పుడు దీని పైన రాహుల్ టీం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications