వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ ఉన్నప్పుడు వేరు, అందుకే కలిశాం: కాంగ్రెస్‌తో పొత్తుపై టీడీపీ కొత్త వాదన!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై అధికార టీఆర్ఎస్‌తో పాటు పాటు బీజేపీ, ఏపీలోని వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

2009లో టీఆర్ఎస్ అదే టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకుందని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తున్నప్పటికీ, మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన తెలుగుదేశం ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని తెలుగు తమ్ముళ్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారట. ఓ విధంగా టీడీపీ - కాంగ్రెస్ పొత్తు ఎవరూ ఊహించని పరిణామం అని అంటున్నారు.

పొత్తును సమర్థించుకుంటున్న టీడీపీ

పొత్తును సమర్థించుకుంటున్న టీడీపీ

కాంగ్రెస్ విషయాన్ని పక్కన పెడితే, ఏపీలో తెలుగుదేశం అధికారంలో ఉంది. తెలంగాణలో, ఏపీలో టీడీపీ దీనిపై పదేపదే వివరణ ఇచ్చుకునే పరిస్థితిలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ ఈ పొత్తుపై మాట్లాడారు. టీడీపీ స్థాపించిన కాలం నాటి పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు అంటూ పొత్తును సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆంధ్రావాళ్లూ! తెలంగాణవాళ్లమని చెప్పుకోండి, మీకు చంద్రబాబే శని, సిగ్గు బుద్ధి రాలేదు: కేసీఆర్ఆంధ్రావాళ్లూ! తెలంగాణవాళ్లమని చెప్పుకోండి, మీకు చంద్రబాబే శని, సిగ్గు బుద్ధి రాలేదు: కేసీఆర్

 ఎన్నో మార్పులు

ఎన్నో మార్పులు

టీడీపీని స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పై ఆరేళ్ల క్రితం ప్రారంభించారని, తెలంగాణ గుండె చప్పుడు అయిన హైదరాబాదులో ప్రారంబించారని ఎల్ రమణ చెప్పారు. టీడీపీ స్థాపించిన సమయంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయని అభిప్రాయపడ్డారు. టీడీపీ ద్వారా ఎన్నో వర్గాలు అసెంబ్లీ, పార్లమెంటులో అడుగు పెట్టాయని చెప్పారు. అయితే తెలంగాణ ఏర్పాడిన అనంతరం రాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు.

కాంగ్రెస్ మాత్రమే కాదు గ్రాండ్ అలయెన్స్

కాంగ్రెస్ మాత్రమే కాదు గ్రాండ్ అలయెన్స్

టీడీపీ పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం నిత్యం పని చేస్తోందని ఎల్ రమణ అన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు కూడా టీడీపీని తమ సొంతం చేసుకున్నారని చెప్పారు. మెరుగైన జీవన సౌకర్యాలు, అబివృద్ధి టీడీపీ ద్వారానే ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తు గురించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మాత్రమే కాదని, సీపీఐ, టీజేఎస్‌లతో కలిసి గ్రాండ్ అలయెన్స్ ఏర్పాటు చేసుకున్నామన్నారు.

కాంగ్రెస్‌లో నాటికి, నేటికి మార్పులు

కాంగ్రెస్‌లో నాటికి, నేటికి మార్పులు


కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ప్రారంభించిన టీడీపీ ఆ పార్టీతో ఎలా కలుస్తుందని టీఆర్ఎస్ ప్రశ్నిస్తోందని అడగ్గా.. ఎల్ రమణ స్పందిస్తూ.. 1982లో టీడీపీ స్థాపించినప్పటికీ, ఇప్పటి కాంగ్రెస్‌కు తేడా ఉందని, ఆ పార్టీ ఐడీయాలజీ, పాలసీల్లో మార్పులు వచ్చాయని చెప్పారు. నాటి కాంగ్రెస్ పాలన కంటే ఘోరంగా ఉందని ఆరోపించారు. 2004లో అధికారం కోల్పోయాక, వరుసగా మూడోసారి టిడిపి ప్రతిపక్షంలో ఉందని, కానీ పార్టీ పటిష్టంగా ఉందని ఎల్ రమణ చెప్పారు.

English summary
Dismissing ruling Telangana Rashtra samithi's (TRS) criticism that TDP was an Andhra party, the state unit of the party has said it was founded by late N T Rama Rao in the city, in the heart of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X