'రేవంత్ రెడ్డిపై వద్దు... 25 ఏళ్లలో సాధించనిది, ఏడేళ్లలో చూపారు'

మహబూబ్ నగర్: 25 ఏళ్లలో సాధించలేని అభివృద్ధిని ఏడేళ్లలో చూపించిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన విమర్శలు సరికాదని టిడిపి నాయకులు అభిప్రాయపడుతున్నారు.

నియోజకవర్గానికి చెందిన పలువురు టిడిపి నేతలు మంగళవారం మాట్లాడారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇరవై అయిదేళ్లలో నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని, కానీ ఏడేళ్లలోనే రేవంత్ ఎంతో చేశారన్నారు.

 TDP leaders counter to TRS Palamuru leaders

రేవంత్ రెడ్డి పైన విమర్శలు మానుకొని నాయకులు అభివృద్ధి పైన దృష్టి పెడితే బాగుంటుందని టిఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ ఇచ్చిన హామీలను ఎంత వరకు అమలు పర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కాగా, కొద్ది రోజులుగా మంత్రి లక్ష్మా రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం నేతలు మంగళవారం నాడు స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+