'వారం రోజులుగా అదే పని, చంద్రబాబును తిట్టేందుకు కేసీఆర్ మంత్రి పదవి పెడతారా?'
హైదరాబాద్/అమరావతి: గత వారం రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మొదలు కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వారి వరకు ఇలా ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసి మాట్లాడటం విడ్డూరమని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శోభారాణి మంగళవారం అన్నారు.

చంద్రబాబును తిట్టడం కోసం మంత్రి పదవి పెట్టేలా ఉన్నారు
తెలంగాణ రాష్ట్రాన్ని పాలించమని బాధ్యతలు అప్పగిస్తే, వీళ్లు మాత్రం పని గట్టుకొని ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం విడ్డూరమని శోభారాణి అన్నారు. చంద్రబాబును తిట్టడం కోసం కేసీఆర్ ఓ మంత్రి పదవిని పెట్టేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. అందుకోసమే తెరాస నాయకులు పోటీ పడి తిడుతున్నారని విమర్శించారు.

కేసీఆర్ నాలుక కోస్తాం
చంద్రబాబుపై తెరాస నేతల విమర్శల మీద ఏపీ టీడీపీ నేతలు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. చంద్రబాబుపై ఇష్టానుసారంగా మాట్లాడితే కేసీఆర్ నాలుక కోస్తామని మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా అంతకుముందు హెచ్చరించారు. 40 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్న చంద్రబాబుపై విమర్శలు సరికాదన్నారు. తెలంగాణలో తెరాస గెలిస్తే ఏపీలో వైసీపీ సంబరాలు చేసుకుంటోందని మండిపడ్డారు. ఏపీకి పరిశ్రమలు వచ్చాయంటే అది చంద్రబాబు వల్లే అన్నారు.

కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
గుంతకల్లు పట్టణంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారు. కేసీఆర్‌కు చంద్రబాబును విమర్శించే స్థాయి లేదన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేదంటే టీడీపీ కార్యకర్తలు బుద్ధి చెబుతారన్నారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్












Click it and Unblock the Notifications