నెత్తిపై కుండ: జలమండలి ఎదుట టీడీపీ ధర్నా (ఫోటోలు)
హైదరాబాద్: నగరంలో అస్తవ్యస్తంగా మారిన నీటి సరఫరాను గాడిన పెట్టడంలో విఫలమైన అధికారుల తీరుకు నిరసనగా శనివారం వాటర్ బోర్డు ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
అనంతరం బోర్డు డైరెక్టర్లు ప్రభాకర శర్మ, సత్యనారాయణకు టీడీపీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పార్టీ సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు, కూన వెంకటేష్ గౌడ్, మేకల సారంగపాణి వినతిపత్రం అందజేశారు.
అనంతరం మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ నెల రోజులుగా నగరంలోని చాలా ప్రాంతాల్లో నీళ్లులేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ఎన్నికల్లో ప్రయోజనం కోసం బిల్లుల మాఫీ అంటూ సర్కారు నాటకమాడుతోందన్నారు.
సరఫరాను మెరుగుపర్చి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని డిమాండ్ చేశారు. ప్రజారోగ్యానికి కారణమవుతున్న కలుషిత జలాల సరఫరాను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వనం రమేష్, నల్లెల కిషోర్ కుమార్, చిట్టి శ్రీధర్ పాల్గొన్నారు.

జలమండలి ఎదుట టీడీపీ ధర్నా
నగరంలో అస్తవ్యస్తంగా మారిన నీటి సరఫరాను గాడిన పెట్టడంలో విఫలమైన అధికారుల తీరుకు నిరసనగా శనివారం వాటర్ బోర్డు ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

జలమండలి ఎదుట టీడీపీ ధర్నా
అనంతరం బోర్డు డైరెక్టర్లు ప్రభాకర శర్మ, సత్యనారాయణకు టీడీపీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పార్టీ సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు, కూన వెంకటేష్ గౌడ్, మేకల సారంగపాణి వినతిపత్రం అందజేశారు.

జలమండలి ఎదుట టీడీపీ ధర్నా
అనంతరం మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ నెల రోజులుగా నగరంలోని చాలా ప్రాంతాల్లో నీళ్లులేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ఎన్నికల్లో ప్రయోజనం కోసం బిల్లుల మాఫీ అంటూ సర్కారు నాటకమాడుతోందన్నారు.

జలమండలి ఎదుట టీడీపీ ధర్నా
సరఫరాను మెరుగుపర్చి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని డిమాండ్ చేశారు. ప్రజారోగ్యానికి కారణమవుతున్న కలుషిత జలాల సరఫరాను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వనం రమేష్, నల్లెల కిషోర్ కుమార్, చిట్టి శ్రీధర్ పాల్గొన్నారు.

Click it and Unblock the Notifications