అమరావతి: రేవంత్‌కు ఘనస్వాగతం, కెసిఆర్‌కు ఏపీ మంత్రులు, కొత్తగా బాలకృష్ణ
అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆయన ఉదయం ఉద్దండరాయనిపాలెంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు.
రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. టిడిపి నేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూర్చీలో నుంచి లేచి మరీ రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. ఏర్పాట్లను రేవంత్ రెడ్డి ఆసక్తిగా తిలకించారు.
కెసిఆర్‌కు మంత్రులు ఘన స్వాగతం
అమరావతి ప్రాంగణానికి చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఏపీ మంత్రులు ఘన స్వాగతం పలికారు. అమరావతి రాజధాని శంకుస్థాపన ప్రాంతం మొత్తం జన సందోహంగా కనిపిస్తోంది.

హైదరాబాద్ నుంచి బయలుదేరిన బాలకృష్ణ
అమరావతి శంకుస్థాపనకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తరలుతున్నారు. గురువారం ఉదయం హైదరాబాదు నుంచి విమానంలో బయలుదేరిన కుటుంబ సభ్యులు గన్నవరం విమానాశ్రయంలో దిగి.. అటు నుంచి అమరావతి బయలుదేరారు.
అక్కడి నుంచి మూడు బస్సుల్లో ఎక్కిన ఎన్టీఆర్ కుటుంబం అమరావతికి బయలుదేరింది. ఓ బస్సులో ఎక్కిన హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భుజానికి బ్యాగ్ తగిలించుకుని కొత్తగా కనిపించారు. దారి పొడవునా ఆయన అభిమానులకు అభివాదం చేస్తూనే ముందుకు సాగారు.
మరోవైపు, తెలంగాణ నుంచి చాలామంది రాజధాని శంకుస్థాపనను చూసేందుకు వెళ్తున్నారు. రాజధాని వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో... చాలామంది చూసేందుకు ప్రజలు వెళ్తున్నారు. హైదరాబాద్, నల్గొండ తదితర ప్రాంతాల నుంచి తరలి వెళ్లారు.












Click it and Unblock the Notifications